సినిమాకు రకరకాల ప్రేక్షకులు ఉంటరారు .కొంత మందికి మూవీ ఎంటర్టైన్మెంట్ అయితే ,కొంత మందికి సినిమా లైఫ్ .
అలానే మనకి కూడా రకరకాల సిట్యువేషన్స్ బట్టి మనకి సినిమాను చూసే విధానం మారిపోతుంది మరికొన్ని సార్లు అలా కాలు మీద కాలు వేసుకొని రిలాక్స్ అవ్వడానికి కామెడీ సినిమాలు చూస్తాము ,కానీ ఎప్పుడైతే మనకు ఒక ఎనర్జీ హై వోల్టేజ్ రావాలి అని అనుకుంటామో అప్పుడే మాస్ కమర్షియల్ సినిమాలు చూడాలనుకుంటాము అది కూడా ఫస్ట్ రోజు థియేటర్స్ లో చూస్తే ఫీలింగే వేరు .ఈ మధ్య కాలంలో మంచి మర్షియల్ సినిమాలు తీయడము అంటే పెద్ద టాస్క్ మరి .
ఇక అసలు విషయానికి వస్తే .2006 లో డైరెక్టర్ హరీష్ శంకర్ షాక్ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు .ఇక మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించనంత స్థాయి లో విజయం అందుకోలేకపోయింది .ఇక షాక్ సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మల్లి మహారాజ్ రవితేజ తోనే యాక్షన్ కామెడీ మూవీ గా మిరపకాయ్ మూవీ తెరకెక్కించి బిగ్గెస్ట్ సూపర్ హిట్ అందుకున్నారు .మిరపకాయ్ మూవీ తో డైరెక్టర్ హరీష్ శంకర్ సక్సెస్ అయితే అందుకున్నారు ,కానీ మల్లి తన నెక్స్ట్ మూవీని డైరెక్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు ,ఇక ఫైనల్ గా 2010 లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయింది .ఇక ఆ మూవీని 2012 లో డైరెక్టర్ హరీష్ శంకర్ తెలుగు లో కొన్ని మార్పులు చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు .రీమేక్ సినిమాలను డైరెక్టర్ హరీష్ శంకర్ బాగా హ్యాండిల్ చేయగలరు అని ఇండస్ట్రీ లో మంచి పేరు ఉంది .అలానే 2014 లో తమిళ్ లో పెద్ద విజయం సాధించిన జిగర్టండా సినిమాను కూడా తెలుగు లో డైరెక్టర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి వరుణ్ తేజ్ కు ఇండస్ట్రీ హిట్ అందించారు.ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ రీమేక్ సినిమా అయినప్పటికీ ఏదైనా తన మార్కు ఎలిమెంట్స్ ,తన పంచ్ డైలాగ్స్ , హీరోయిజమ్ తో స్క్రీన్ మీద ప్రేక్షకుల అభిరుచి ట్రెండ్ కి తగ్గట్టుగా తెరకెక్కించి ఇండస్ట్రీ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంటారు

ఇక సంక్రాంతి పండగ కి వీరసింహారెడ్డి‘ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి హీరో బాలకృష్ణ .ఇక వీర సింహారెడ్డి సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా కంప్లీట్ అయిన తరువాత బాలకృష్ణ తాను చేయబోయే నెక్స్ట్ సినిమాలు వరుసగా రెడీ గా ఉన్నాయి .ఈ క్రమంలో ‘ఆదిత్య 369‘ మూవీ సీక్వెల్ గా ‘ఆదిత్య 999‘ మూవీ అనౌన్స్ చేశారు .ఇక ‘ఆదిత్య 999’ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలు మొదలు పెడుతున్నారు అనే విషయం పక్కన పెడితే .డైరెక్టర్ హరీష్ శంకర్ ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకకు వచ్చిన హరీష్ శంకర్ బాలకృష్ణతో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట చెప్పారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ ”మా బావ గోపీచంద్ మలినేనికి గుర్తు ఉందో? లేదో? నేనే ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశా.నువ్వు ఎప్పుడూ బాలకృష్ణను డైరెక్ట్ చేయలేదు కదా! రేపు ఓపెనింగ్ ఉంది.
వచ్చి ఒక్క షాట్ చెయ్’ అని నన్ను ఇన్వైట్ చేశాడు.

ఒక్క షాట్ డైరెక్ట్ చేస్తేనే రిజల్ట్ ఇలా ఉంది అంటే.రేపు సినిమా డైరెక్ట్ చేస్తే? ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది ? ఇక అతి త్వరలో బాలయ్య బాబు గారిని ఒప్పించి, మంచి కథతో ఆయన అనుమతి తీసుకుని సినిమా డైరెక్ట్ చేయడానికి చాలా బలమైన కోరికతో ఉన్నాను.మాస్ హీరో బాలకృష్ణ సినిమా అంటేనే మాస్ ఎలిమెంట్స్ ,సెటిమెంట్స్ , డైలాగ్స్ ,హీరోయిజమ్ ,ఎలివేషన్స్ ఫైట్స్ ,ఇలా అన్ని ఉంటాయి ,డైరెక్టర్ హరీష్ శంకర్ ,హీరో బాలకృష్ణ కు సరిపోయే స్టోరీ సిద్ధం చేసుకొని బాలయ్య తో ఒకే చేయించుకుంటే , ఇక బాలయ్య అభిమానులకు పెద్ద పండుగే .మరి ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో అనే విషయం తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంతవరకు ఎదురుచూడాలసిందే .







