టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.బాబీ డైరెక్షన్ లో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.2023 సంక్రాంతి పండుగ కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కానుంది.సినిమా రిలీజ్ కు రెండున్నర నెలలు ఉన్నా ఇప్పటికే థియేటర్ల అడాన్స్ బుకింగ్ మొదలైందని సమాచారం అందుతోంది.
అయితే తాజాగా దీపావళి పండుగ కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా నుంచి టీజర్ విడుదలైంది.అయితే ఈ టీజర్ లో చిరంజీ బీడీ తాగడంపై నెటిజన్ల నుంచి, మెగా ఫ్యాన్స్ నుంచి డైరెక్టర్ బాబీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కోట్ల సంఖ్యలో అభిమానులు చిరంజీవిని అభిమానిస్తున్నారని చిరంజీవిని అలా చూపించడం బాబీకి న్యాయమేనా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

చిరంజీవి గతంలో కొన్ని సినిమాలలో సిగరెట్లు తాగినా ఆ సిగరెట్లు మిల్క్ మేడ్ సిగరెట్లు అనే సంగతి తెలిసిందే.వైరల్ అవుతున్న కామెంట్ల గురించి చిరంజీవి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి ఊరమాస్ రోల్ లో నటించి సక్సెస్ ను సొంతం సొంతం చేసుకున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు.చిరంజీవి శృతి హాసన్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో శృతి హాసన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మైత్రీ నిర్మాతలు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను తెరకెక్కించారు.చిరంజీవి ఈ సినిమా కోసం 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి అభిమానులకు నచ్చే కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండనున్నాయని తెలుస్తోంది.







