వనపర్తి జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది.పరువు కోసం కన్న కూతురును ఓ తండ్రి దారుణంగా హత్య చేశాడు.
ఈ అమానుష ఘటన పెబ్బేరు మండలం పాతపల్లిలో చోటు చేసుకుంది.కూతురు అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది.
ఈ విషయం తెలిసిన తండ్రి కుమార్తెను పలుమార్లు వారించాడు.అయినా తీరు మార్చుకోకపోవడంతో కోపోద్రిక్తుడైన తండ్రి కూతుర్ని దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది.
కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి హత్య చేసినట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







