ఆ హీరోయిన్ సినిమాను చేజిక్కించుకున్న దిల్ రాజు!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా రిలీజ్ చేస్తున్నాడంటే ఆ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని అంటారు.

అలాగే దిల్ రాజు రిలీజ్ చేసే సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతాయనే బ్రాండ్ కూడా ప్రేక్షకుల్లో ఏర్పడింది.

కాగా ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న దిల్ రాజు, చిన్న బడ్జెట్ సినిమాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.ఇప్పటికే పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్న దిల్ రాజు వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్‌ను కూడా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక తాజాగా యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తున్న ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను దిల్ రాజు చేజిక్కించుకున్నాడు.

‘గుడ్ లక్ సఖీ’ అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తుండగా శ్రావ్య వర్మ మరియు సుధీర్ చంద్ర ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమాకు కేటాయించిన బడ్జెట్‌లో ఇప్పటికే సగం ఖర్చు పెట్టారని, రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ మరింత పెరుగుతుందని వారు భావించారు.దీంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజును వారు సాయం చేయాల్సిందిగా కోరారు.

కాగా సినిమా కంటెంట్, రషెస్ చూసిన దిల్ రాజు ఈ సినిమాను తాను ప్రొడ్యూస్ చేయడానికి ఓకే అన్నాడు.సినిమా రిలీజ్ అయిన తరువాత నిర్మాతల డబ్బును వారికి తిరిగిచ్చేందుకు ఒప్పుకున్నాడు.

దీంతో సదరు నిర్మాతలు సంతోషంగా తమ సినిమాను దిల్ రాజు చేతిలో పెట్టారు.మరి ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో రాబోతుందా అనే ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మొదలైంది.

వాళ్లు ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా.. బ్రహ్మాజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు