తెలుగులో ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వర రావు దర్శకత్వం వహించిన ఫోటో అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన తెలుగు అమ్మాయి “అంజలి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే అంజలి సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో అవకాశాల కోసం బాగానే ఇబ్బందులు ఎదుర్కొంది.
కానీ టాలీవుడ్ లో మాత్రం సినీ అవకాశాలను దక్కించుకో లేకపోయింది.దీంతో కోలీవుడ్, మలయాళ సినీ పరిశ్రమకు వెళ్ళిపోయి అక్కడ హీరోయిన్ గా బాగానే సక్సెస్ అయింది.
అయినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో కొంతకాలం పాటు గుర్తింపుకి నోచుకో లేకపోయింది.దీంతో నిమా పరిశ్రమలో తన ఉనికిని చాటుకునేందుకు పలు చిన్న బడ్జెట్ చిత్రాల్లో కూడా నటించింది.
కానీ ఈ చిత్రాలు ఈ అమ్మడి సినీ కెరియర్ కి పెద్దగా ఉపయోగపడలేదు.
అయితే తాజాగా నటి అంజలికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఇంతకీ ఆ ఫోటోలలో ఏముందంటే నటి అంజలి పలు చిత్రాలలో డీ గ్లామరస్ పాత్రలో కూడా నటించింది.దీంతో ఆ సమయంలో తీసినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
దీంతో కొందరు అంజలి అభిమానులు కూడా అప్పటికీ ఇప్పటికీ అంజలి చాలా మారిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేగాక సినిమా అనే రంగుల ప్రపంచంలో మనం అందంగా కనిపించకపోతే రాణించాలేమని అందువల్లనే అంజలి కూడా పలు ప్లాస్టిక్ సర్జరీలు వంటివి చేయించుకుని గ్లామరస్ గా తయారయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అంజలి లేటెస్ట్ ఫోటోలను ఒకసారి చూసినట్లయితే ఈ మధ్య ఈ అమ్మడు సినిమా అవకాశాల కోసం బాగానే బరువు తగ్గినట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అంజలి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో తెరకెక్కిన “వకీల్ సాబ్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.ఇందుకుగాను ఈ అమ్మడు దాదాపుగా 50 లక్షల రూపాయలకు పైగా పారితోషికం అందుకున్నట్లు సమాచారం.వకీల్ సాబ్ చిత్రం మంచి హిట్ అవడంతో ప్రస్తుతం అంజలికి సినిమా ఆఫర్లు బాగానే క్యూ కడుతున్నాయి.
కాగా ప్రస్తుతం అంజలి తెలుగులో విక్టరీ వెంకటేష్ మరియు యంగ్ హీరో వరుణ్ తేజ్ లు కలసి మల్టీ స్టారర్ గా నటిస్తున్న “ఎఫ్ 3” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే కన్నడలో కూడా “శివప్ప” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.