బాలయ్య మొదటి సినిమాపై అప్పటి ప్రభుత్వం బ్యాన్ వేసిందని మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఒక నటుడుగా ఎంత పేరు సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఈయనకు తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం ఉంది.ఎన్నో సినిమాలలో నటించిన ఈయన స్టార్ హీరోగా ఎదిగాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.యంగ్ హీరోలతో పోటీ గా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు.

ఒక సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే మరో సినిమాకు సైన్ చేస్తున్నాడు బాలయ్య.ఇటీవలే అఖండ సినిమాతో కెరీర్ పరంగా సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

Advertisement

అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.ఇక బాలయ్య వ్యాఖ్యాతగా కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాడు.

తెలుగు ఓటీటీ వేదికగా ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే అనే షో లో హోస్ట్ గా చేశాడు.ఇక బాలయ్య అఖండ సినిమా తర్వాత మరో సినిమాలో బిజీ గా మారాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య.ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో కనిపించనున్నాడు.

అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా మరో సినిమాకు సైన్ చేశాడు.వెంకీ అట్లూరితో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు దిల్ రాజు బ్యానర్ లోకూడా వరుస సినిమాలకు సైన్ చేశాడని తెలుస్తుంది.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

ఇక ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య సినిమాలు మంచి పేరు సంపాదించుకున్నాయి.ఎప్పుడు కూడా ఆయన సినిమాల నుంచి ఎటువంటి వివాదాలు ఎదురుగా కాలేవు.

Advertisement

కానీ ఈయన నటించిన మొదటి సినిమా ప్రభుత్వం నిషేధించి మళ్లీ రెండు నెలల తర్వాత విడుదల చేసిందట.ఇంతవరకు ఈ విషయం చాలా వరకు తెలియక పోగా.అసలేం జరిగిందో తెలుసుకుందాం.1974 లో బాలకృష్ణ తాతమ్మకల అనే సినిమాలో నటించాడు.ఇక ఈ సినిమాకు నందమూరి తారక రామ దర్శకత్వం వహించగా.

హరికృష్ణ, భానుమతిలు కూడా నటించారు.ఆ సమయంలో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఈ సినిమాను రూపొందించగా.

అందులో భూ సంస్కరణలు పై ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపిన సన్నివేశాలు, డైలాగులు వివాదం గా మారాయి.

ఇద్దరు ముద్దు ఆపై వద్దు అని సాగుతున్న కుటుంబ నియంత్రణ ప్రచారానికి వ్యతిరేకంగా ఈ సినిమా వద్దంటూ అసెంబ్లీలో కూడా బాగా చర్చలు జరిగాయి.అప్పటికే ఈ సినిమా విడుదలై 50రోజులు కాగా.ఈ సినిమా ప్రదర్శనను పూర్తిగా నిలిపివేయాలి అని కేంద్రం నుండి లేఖ కూడా వచ్చింది.

దీంతో ఎన్టీఆర్ కుటుంబ నియంత్రణకు, భూ సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ సినిమా తీయలేదు అని.కష్టపడి పనిచేస్తే అలాంటి సంస్కరణలతో పనిలేదని చెప్పే ప్రయత్నం చేశాను అని అనడంతో కేంద్రం ఆ సినిమాను పరిశీలించి మళ్లీ రెండోసారి కొన్ని మార్పులు చేసి కలర్ లో విడుదల చేశారట.మొదటిసారి బ్లాక్ అండ్ వైట్ లో విడుదల చేశారట.

తాజా వార్తలు