చట్ట సభలకు వెళ్లడమే అదృష్టంగా భావిస్తారు… అలాంటి అవకాశాన్ని ఎంతో మంది తమదైన శైలిలో వినియోగించుకుంటారు.తాము ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజలకు న్యాయం చేస్తారు.
ప్రజా గొంతుకను గట్టిగా వినిపించాలి.ఎంతో బాధ్యతగా ఉండాలి.
కానీ ప్రస్తుతం అలా జరగడంలేదు.దక్కిన గోల్డెన్ చాన్స్ ఏమాత్రం వినియోగించుకోవడం లేదు.
సాధారణంగా లోక్ సభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.ఇక రాజ్యసభ సభ్యును పరోక్షంగా ఉంటుంది.
ఇక పెద్దల సభలో అడుగుపెట్టే వారిని వివిధ రంగాలలో నిష్ణాతులు అని నమ్మే సభకు పంపిస్తారు.మరి వాళ్లు సభలలోకి వెళ్లి ఏం చేస్తున్నారు.? ఇక లేటెస్ట్ గా జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో టీఆర్ఎస్ నుంచి కొత్తగా ఎంపిక అయిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని అంటున్నారు.
ఇలా వెళ్లి అలా వచ్చేశారు.
వీళ్లను నమ్మి అక్కడికి పంపిస్తే కనీసం సభలో ఒక్కటి అంటే ఒక్క ప్రశ్న కూడా వేయలేదని అంటున్నారు.దీని మీద నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.
వెళ్లామా.వచ్చామా అన్నట్లుగా ఉందని అంటున్నారు.
ఇక ఇదే సభలో బీజేపీ తరఫున యూపీ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అయిన లక్ష్మణ్ అయితే ఏకంగా ఇరవై ఆరు ప్రశ్నలను వేసి శభాష్ అనిపించుకున్నారట.ఆయన తొలి ప్రయత్నంలోనే ఇన్నేసి ప్రశ్నలు వేయడం అంటే ఇక రానున్న ఆరేళ్లలో ఇంకా ఎలా ప్రశ్నలు సంధించబోతారో అర్థం చేసుకోవచ్చు.
ఇక టీఆర్ఎస్ లో సీనియర్ రాజ్యసభ సభ్యుడు కూడా ఒకరు ఉన్నారు.ఆయనే సంతోష్.
ఆయన నెగ్గి చాలా కాలం అయినా ముచ్చటగా మూడు ప్రశ్నలు కూడా సభలో వేయలేదట.ఓ రెండు ప్రశ్నలు అడిగేసి మమా అనిపించుకున్నారట.
అంటే మన ఎంపీలు తెలంగాణ సమాజం గురించి ఇంతటి బాధ్యతగా ఉంటున్నారా.? అనే ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.

గులాబీ బాస్ లడాయి అంటుంటే.ఇక ఓ పక్క రాష్ట్రంలో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్దం ప్రకటిస్తుంటే తమ ఎంపీలు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.ఇక ఎలాగూ తొలి సమావేశాలు పోయాయి.మరి రెండో సమావేశాలలోనైనా మరి గట్టిగా నిగ్గదీసి ప్రశ్నలు అడుగుతారేమో చూడాలి మరి.లేదంటే ఈసారి నెటిజన్లు నేతలను గట్టిగానే నిలదీసేలా ఉన్నారు.ఇక ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.