ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటెల వ్యూహం విఫలమైనట్టేనా?

తెలంగాణ రాజకీయాలలో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్న విషయాలను మనం చూస్తున్నాం.

టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చిన తరువాత టీఆర్ఎస్ పతనమే లక్ష్యంగా మాజీ మంత్రి ఈటెల ముందుకెళ్తున్న క్రమంలో ప్రతి ఒక్క విషయంలో టీఆర్ఎస్ ను వెనక్కి నెట్టాలనే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగరవేస్తుందనే విషయం మనకు తెలిసిందే.ఎందుకంటే ఎక్కువ ఎంపీటీసీలు టీఆర్ఎస్ తరపున గెలిచిన వారున్నారు కాబట్టి.

అయితే టీఆర్ఎస్ పార్టీ ముందుగా అన్ని ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని భావించినా కొన్ని చోట్ల ఎన్నిక అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఎమ్మెల్సీ స్థానం కరీంనగర్.

కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి రెబల్ అభ్యర్థిగా రవీందర్ సింగ్ బరిలో ఉన్న విషయం తెలిసిందే.ఇతను రెబల్ అభ్యర్థిగా నిలబడటానికి ప్రధాన కారణం ఈటెల రాజేందర్ అని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

Advertisement

అంతేకాక రవీందర్ సింగ్ ని గెలిపించాలని ఈటెల రాజేందర్ వీడియో ద్వారా కూడా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.కాని ఈటెల వ్యూహాలను ముందుగానే గమనించిన టీఆర్ఎస్ ఎంపీటీసీలను క్యాంపులకు తరలించి ఈటెల రవీందర్ సింగ్ వ్యూహాలకు అడ్డుకట్ట వేశారు.

అయినా రవీందర్ సింగ్ మాత్రం ఎంతో కొంత తన గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ గెలుపు అవకాశాలు మాత్రం లేవు అన్నది ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్ధమవుతోంది.

మరి టీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పలుకుబడితో ఝలక్ ఇవ్వాలనుకున్న ఈటెల వ్యూహాలు విఫలమైనట్టేనా అంటే చివరి ఫలితాలు వచ్చే వరకు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది.మరి అన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి మరొక్కసారి టీఆర్ఎస్ సత్తా చాటుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు