2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం నుంచి బీజేపీ( BJP )ని గద్దె దించాలని విపక్షాలు గట్టి పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే.విడివిడిగా మోడిని ఢీ కొట్టలేమని భావించిన విపక్షాలు.
కలిసికట్టుగా మోడిని ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాయి.ఐక్యత కోసం విపక్ష పార్టీలు చేస్తున్న ఎన్నో ప్రయత్నాలు తాజాగా ఒ కొలిక్కి వచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి.
గత కొన్నాళ్లుగా విపక్షలను ఏకం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గట్టిగానే ప్రయత్నిస్తూ వస్తున్నారు.ఆయన ప్రయత్నాలు ఫలించి నేడు పాట్నాలో విపక్ష పార్టీల అధినేతలు అందరు నితీశ్ కుమార్( Nitish Kumar ) అధ్యక్షతన భేటీ అయ్యారు.

ఈ బేటీలో కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, తమిళనాడు సిఎం స్టాలిన్, జార్ఖండ్ సిఎం, డిల్లీ సిఎం, యూపీ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరత్ పవార్ ( Sharad Pawar)వంటి రాజకీయ ఉద్దండులు భేటీ అయ్యారు.అయితే ఈ భేటీలో నేతలు ఏ విషయాలపై చర్చలు జరపనున్నారు.ఎలాంటి ప్లాన్స్ తో ముందుకు వెళ్లనున్నారు అనే దానిపై క్లారిటీ లేనప్పటికి.విలక్షలను లీడ్ చేసే నాయకత్వం విషయంపైనే ప్రధాన చర్చ ఉండే అవకాశం ఉంది.మరి అందరు హేమాహేమీలు ఉన్న నేపథ్యంలో విపక్షాలను లీడ్ చేసే బాధ్యత ఎవరిని వరిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంచితే విపక్షాల కూటమిని బీజేపీ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.ఎంతమంది ఒకటైన, ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన మళ్ళీ అధికారం చేపట్టేది మోడినే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 300 కు పైగా సీట్లు ఎన్డీయే గెలిచ్చుకోవడం ఖాయమని కమలనాథులు చెబుతున్నారు.
మరి ఒకవైపు విపక్షాలు ఏకమౌతున్న వేల బీజేపీ ఎందుకింత కాన్ఫిడెంట్ గా ఉందంటే.దానికి ఒకటే కారణం.విపక్షాలన్నీ ఒకే నిర్ణయానికి రావడం జరగదని, అని పార్టీల నేతలు కలిసి నడవడం సాధ్యం కాదని.అందుకే విపక్షాల ఐక్యతను బీజేపీ లైట్ తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరి వచ్చే ఎన్నికల్లో విపక్షాల ప్లాన్స్ ఫలిస్తాయా లేదా బీజేపీ కాన్ఫిడెంట్ నెరవేరుతుందా చూడాలి.