SV Krishna Reddy : ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన ఆ ఒక్క తప్పు వల్లే ఆయన ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయ్యారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎస్ వి కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) తనకంటూ ఒక ప్రత్యేక స్థానన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు.

ముఖ్యంగా ఈయన ఫ్యామిలీ ఆడియన్స్( Family audience ) ని బేస్ చేసుకొని చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించి పెట్టాయి.

ఇక ఇలాంటి సమయంలోనే ఆయన శ్రీకాంత్, జగపతిబాబు లాంటి హీరోలను పెట్టి తీసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

దాంతో చాలా సంవత్సరాల పాటు డైరెక్టర్ గా కొనసాగుతాడు అని అందరు అనుకున్నారు.కానీ ఈయన చేసిన ఒక మిస్టేక్ వల్ల ఆయన కెరియర్ అనేది ఎక్కువ కాలం సక్సెస్ఫుల్ గా సాగలేదు.అది ఏంటి అంటే ఈయన పెద్ద హీరోలకు సక్సెస్ లను ఇవ్వలేకపోయారు.

ముఖ్యంగా వజ్రం సినిమాతో( Vajram movie ) నాగార్జునకి ఒక భారీ ఫ్లాప్ ని ఇస్తే, టాప్ హీరో సినిమాతో బాలయ్య బాబుకి మరొక భారీ ఫ్లాప్ ఇచ్చారు.ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి మంచి హిట్ ఇచ్చినట్లయితే వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మరీ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగి ఉండేవారని ఈయన గురించి తెలిసిన చాలా మంది సినీ మేధావులు సైతం ఇదే అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.

Advertisement

ఇక ఇప్పుడు ఆయన సినిమాలు చేసిన కూడా అడపదడపా ఏదో ఒక చిన్న సినిమాలు చేస్తున్నారు తప్ప భారీ గుర్తింపు ను తీసుకువచ్చే సినిమాలు అయితే చేయలేకపోతున్నారు.ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా మంచి సినిమాలు తీసిన కృష్ణారెడ్డి ఇప్పుడు ఇలా ఫేడ్ అవుట్ డైరెక్టర్ గా ఉండిపోవడం అనేది చాలామందిని బాధించే విషయం అనే చెప్పాలి.మరి ఇప్పటికైన ఆయన ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమా తీసి మరి కొంత మంది పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని కోరుకుందాం.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు