సుమతో పెళ్లికి రాజీవ్ అలాంటి కండిషన్స్ పెట్టారా?

బుల్లితెర కార్యక్రమాలకు మకుటం లేని మహారాణిగా స్టార్ మహిళగా కొనసాగుతూ ఎన్నో కార్యక్రమాలని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి వారిలో యాంకర్ సుమ( Suma ) ఒకరు.

ఈమె బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఏ సినిమా వేడుక జరిగిన తప్పకుండా అక్కడ సుమ ఉండాల్సిందే సుమ చేత ఆ సినిమా వేడుక నిర్వహిస్తే మరింత హైప్ వస్తుందని దర్శక నిర్మాతలు కూడా భావిస్తూ ఉంటారు.

అలా టీవీ రంగంలో ఎంతో బిజీగా మారిపోయినటువంటి సుమ క్షణం పాటు తీరికలేకుండా గడుపుతున్నారు.

ఇకపోతే సుమ నటుడు రాజీవ్ కనకాలనుs( Rajeev Kanakala ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే సుమ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె రాజీవ్ కనకాల గురించి మాట్లాడుతూ ఆయన పెళ్లి చేసుకోవడానికి ముందు తనకు కొన్ని కండిషన్స్ పెట్టారు అంటూ ఈమె అసలు విషయం బయట పెట్టారు.1994 వ సంవత్సరంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అయితే 99 లో వీరి వివాహం( Marriage ) జరిగిందని సుమ తెలియజేశారు.

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో రాజీవ్ కనకాల తనని పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదు అనే కండిషన్ పెట్టారట తనకు ఇలాంటి కండిషన్ పెట్టడంతో అది నచ్చక సుమ కొద్ది రోజులపాటు తనతో బ్రేకప్ చెప్పుకొని రెండు సినిమాలలో నటించారని తెలియజేశారు.అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తాను సినిమాల్లోకి వెళ్ళకూడదని భావించారట.ఆ సమయంలోనే తిరిగి రాజీవ్ కనకాలతో మాట్లాడి వీరి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి అనంతరం పెళ్లికి ఒప్పించారట.

Advertisement

ఇక పెళ్లి తర్వాత సుమ సినిమాలకు దూరమైన బుల్లితెర కార్యక్రమాలలో యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చారు.అయితే తను చేసే ఏ వేడుకకి అయినా మొదటి విమర్శకుడు రాజీవ్ కనకాలేనని ఆయన బాగుంటే బాగుంది లేకపోతే లేదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తారని తెలియజేశారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు