నాని సినిమా కి ఫస్ట్ డే అన్ని కోట్లు వచ్చాయా..?

Did Nani Get All The Crores On The First Day ,Nani,Keerthy Suresh,dasara, Nizam Area, Nani's Career,Cherukuri Sudhakar

నాని( nani ) హీరోగా, కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా వచ్చిన దసర సినిమా( dasara ) శ్రీరామ నవమి సందర్భంగా విడుదలయి పాజిటివ్ టాక్ తోదూసుకుపోతుంది…ఈ సినిమా రిలీజ్ కి ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకుందనే చెప్పాలి.సుమారు 900 కి పైగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అయ్యింది .

 Did Nani Get All The Crores On The First Day ,nani,keerthy Suresh,dasara, Nizam-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ స్దాయిలో ఉన్నాయనేది హాట్ టాపిక్ గా మారింది.ఇక తెలంగాణా నేపధ్యంలో వచ్చిన ఈ చిత్రం నైజాం ఏరియాలో కుమ్మేసిందని చెప్పాలి.

దాదాపు 7 కోట్లు నైజాం ఏరియాలో వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.ప్రతీచోటా భారీ ఓపినింగ్స్ వచ్చాయి.ఆంధ్రా విషయానికి వస్తే.ఉత్తరాంధ్ర – 1.25 కోట్లు , గుంటూరు – 1.1 , ఈస్ట్ గోదావరి – 0.87 , కృష్ణా – 0.62 , వెస్ట్ గోదావరి – 0.54 , నెల్లూరు – 0.34 కోట్లు.ఇలా ఆంధ్రా షేర్ – 4.72 కోట్లు రాబట్టింది.అమెరిక భాక్సాఫీస్ విషయానికి వస్తే.ప్రీమియర్స్ ద్వారా ఆరు లక్షల డాలర్స్ రాబట్టినట్టు సమాచారం.

Telugu Dasara, Keerthy Suresh, Nani, Nanis Career, Nizam Area-Movie

ఈ సినిమా సీడెడ్ – 3 కోట్లు వసూల్ చేసింది .మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.గ్రాస్ లెక్క‌ల్లో చూస్తే ఈ క‌లెక్ష‌న్స్ 24.85 కోట్లు అని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిసి 1.52 కోట్లు వచ్చింది.నార్త్ ఇండియాలో 55 లక్షలు వచ్చాయి.ఓవర్ సీస్‌లో 4.10 కోట్లు వచ్చాయి.మొత్తంగా చూస్తే గ్రాస్ ప్రకారం 38.65 కోట్లు అని ట్రేడ్ సమాచారం.ఈ మూవీ నాని కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ రాబడుతుంది.

నాని న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది.అయిన‌ప్ప‌టికీ రిస్క్ చేసి శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో ఈ సినిమా చేయ‌టానికి నేచుర‌ల్ స్టార్ రెడీ అయిపోయారు.చెరుకూరి సుధాక‌ర్ ఈ సినిమా కోసం ఏకంగా భారీగానే ఖర్చు పెట్టారు… అయితే నాని కెరియర్ లో ఈ సినిమా భారీ హిట్ కావడమే కాకుండా లాంగ్ రన్ లో కూడా భారీ వసూళ్లను సాధిస్తుందనే చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube