తనపై కెసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని హరీష్ రావు నిలబెట్టుకున్నట్టేనా?

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి హరీష్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.ట్రబుల్ షూటర్ గా తెలంగాణ రాజకీయాలలో హరీష్ రావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

టీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితులలో  ఉన్న సమయంలో అక్కడ హరీష్ రావు కాలు మోపాడంటే  ఇక అక్కడ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కొంత కంగారు పడాల్సిందే.ఇలా చాలా సమయాల్లో కెసీఆర్ హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించిన దాఖలాలు ఉన్నాయి.

అలా కొడంగల్, నాగార్జున సాగర్ ఇప్పుడు హుజూరాబాద్ ఇలా అన్ని సమయాల్లో టీఆర్ఎస్ ను గెలుపు బాటలో పయనించేందుకు కృషి చేసి, తన వ్యూహాలను క్షేత్ర స్థాయిలో పకడ్భందీగా అమలుపరచిన పరిస్థితి ఉంది.ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా మంత్రి హరీష్ రావు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందు నుండే హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించి అక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులను ఆకళింపు చేసుకొని తనదైన శైలిలో వ్యూహ రచన రచించి టీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగారు.అయితే ఎట్టకేలకు పోలింగ్ ముగిసిన తరుణంలో ఇప్పుడు హరీష్ రావు టీఆర్ఎస్ గెలుపు కోసం పోషించిన పాత్రపై చర్చ నడుస్తోంది.ముఖ్యమంత్రి  కెసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని  హరీష్ రావు నిలబెట్టుకుంటాడా.

Advertisement

కెసీఆర్ కు విజయాన్ని దీపావళి కానుకగా అందిస్తారా అంటూ  జోరుగా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.అయితే టీఆర్ఎస్ గెలిచే అవకాశ ముందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమవుతుండగా, బీజేపీ గెలిచే అవకాశముందని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమవుతోంది .ఏది ఏమైనా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే   హరీష్ రావు వ్యూహాలు వందకు వంద శాతం ఫలించాయని మనం అర్థం చేసుకోవచ్చు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు