గర్వంగా ఉంది : సాక్షిసింగ్ ధోని

భార‌త క్రికెట్ జ‌ట్టుకు సార‌థిగా వహించి ఎన్నో గొప్ప విజయాలను అందించిన మహేంద్ర సింగ్ ధోని శనివారం రిటైర్మెంట్ ప్రకటించారు.

ఈ విషయం విన్న ధోని అభిమానులు ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికిలోనై ఎందుకు ఇలా చేశారు ధోనిజీ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

అస‌లు ధోని అభిమానులు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.వికెట్ల వెనుక ధోని లేకుండా ఎలా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అటు ప్రపంచవ్యాప్తంగా సెలెబ్రెటీలు, తోటి ఆటగాళ్లు ధోని రిటైర్మెంట్‌పై స్పందించారు.తాజాగా ఈ విషయంపైన ధోని భార్య సాక్షి సింగ్ కూడా స్పందించారు.

సాక్షిసింగ్ తన భర్త ధోని గురించి మాట్లాడుతూ.‘‘అభిమానులు మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడతారు.

Advertisement

క్రికెట్ నుంచి వీడ్కోలు పలికినందుకు అభిమానులు అభినందనలు తెలిపారు.మీరు సాధించిన విజయాలను చూసి నేను గ‌ర్వ‌ప‌డుతున్నాను.

మీకు ఎంతో ఇష్ట‌మైన క్రికెట్‌కు నుంచి విరమణ చేస్తానని చెప్పినప్పుడు మీరు పడిన మాన‌సిక క్షోభ నాకు అర్థమైంది.కన్నీళ్లను దిగమింగి.

రిటైర్మెంట్‌ తెలిపారని నాకు తెలుసు.రిటైర్మెంట్ పొందాక మీరు మాతో ఎల్ల‌ప్పడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.

ఇన్నేళ్ల క్రికెట్ ప్రయాణంలో మీరు చెప్పిన మాటలు, దేశానికి అందించిన విజ‌యాలు ప్రజలు, అభిమానులు మర్చిపోవచ్చు కానీ, వాళ్లకు మీరు అందించిన ఫీలింగ్, ఘనతకు ఏనాటికి మరిచిపోరు.’’ అంటూ సాక్షిసింగ్‌ భావోద్వేగ భరితంగా మాట్లాడారు.

ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?
Advertisement

తాజా వార్తలు