ధోని ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన ట్విట్టర్.. ఏం జరిగిందంటే?

మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటే క్రీడా లోకానికి మస్తు ఇష్టం.

ఈ టీమిండియా మాజీ ఆటగాడు ప్రజెంట్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.

కొవిడ్ ఎఫెక్ట్‌తో ఐపీఎల్ సీజన్ 14 పోస్ట్ పోన్ కాగా, ప్రస్తుతం మహీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాడు.కాగా, తాజాగా మహీ సోషల్ మీడియాలో వార్తలో నిలిచాడు.

ఆయన ఫ్యాన్స్ చేసిన పని వల్ల మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ దిగొచ్చింది.ఇంతకీ ధోని ఫ్యాన్స్ ఏం చేశారంటే.

ధోని ట్విట్టర్ అకౌంట్‌కు ట్విట్టర్ ఇటీవల బ్లూ టిక్‌ను తీసేసింది.ఎందుకు అలా బ్లూ టిక్‌ను తీసేసిందో? తెలపలేదు ట్విట్టర్ సంస్థ.అయితే, ధోని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడం వల్లే ట్విట్టర్ బ్లూ టిక్ తీసేసిందని కొందరు నెటిజన్లు పేర్కొనగా, దానిని ట్విట్టర్ అయితే ధ్రువీకరించలేదు.

Advertisement

బ్లూ టిక్ తీసేయడం ద్వారా జార్ఖండ్ రత్న ధోని పట్ల ట్విట్టర్ సంస్థ వివక్ష చూపుతున్నదని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ట్విట్టర్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు.

దాంతో ధోని అభిమానుల ఆగ్రహాన్ని చూసి ట్విట్టర్ వెనక్కు తగ్గింది.ధోని అకౌంట్‌కు వెంటనే బ్లూ టిక్‌ని అప్‌డేట్ చేసింది.

ఈ విషయం తెలుసుకుని నెటిజన్లతో పాటు ధోని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.ట్విట్టర్ సంస్థ‌కు థాంక్స్ చెప్పారు.

ధోని ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.సోషల్ మీడియాలో ధోని యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ ఆయన భార్య సాక్షి సింగ్ మాత్రం ధోనికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

మహీ నయా లుక్ ఫొటోస్‌ను ఇటీవల సాక్షి సింగ్ పోస్ట్ చేయగా, అవి నెట్టింట వైరలయిన సంగతి తెలిసిందే.ఇకపోతే మహేంద్ర సింగ్ ధోని తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం చేస్తారు.

Advertisement

ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో నెట్టింట సందడి చేశాయి.

తాజా వార్తలు