ఢీ కొరియోగ్రాఫర్ చైతన్యకు పేమెంట్ ఆపేశారు.. ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు!

ఈటీవీ షోల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో ఝాన్సీ( Jhansi ) ఒకరు.తన ప్రతిభతో ఝాన్సీ ఈ స్థాయికి చేరుకున్నారు.

అయితే తాజాగా ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య( Choreographer Chaitanya ) ఆత్మహత్య నేపథ్యంలో ఝాన్సీ ఒకింత ఘాటుగా స్పందించారు.చైతన్య అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడం వల్ల వాళ్ల ఫ్యామిలీ బాధ పడుతోందని ఝాన్సీ తెలిపారు.

తనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లతో మాట్లాడి ఉంటే బాగుండేదని ఆమె చెప్పుకొచ్చారు.అందరూ కలిసి తనతో ప్రయాణం చేసిన వాళ్లే అని ఝాన్సీ కామెంట్లు చేశారు.

తన పరిస్థితి గురించి చెప్పి ఉంటే తోటి డ్యాన్సర్లు ఆయనకు కచ్చితంగా సహాయం చేసేవారని ఝాన్సీ కామెంట్లు చేశారు.మా కళాకారులు డబ్బులు ఇవ్వాలని వేధించేంత కఠినమైన వాళ్లు కాదని ఆమె తెలిపారు.

Advertisement

అన్నయ్య ఎందుకు ఇలాంటి పని చేశాడో అర్థం కావడం లేదని ఝాన్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

చైతన్య మాస్టర్ ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేసేవారని ఝాన్సీ చెప్పుకొచ్చారు.చైతన్య మాస్టర్ కు ఒక ప్రోగ్రామ్ కు సంబంధించి పేమెంట్ రావాల్సి ఉందని కొంతమంది ఆర్టిస్టులు హ్యాండ్ ఇవ్వడంతో 7 లక్షల రూపాయల పేమెంట్ ఆగిపోయిందని ఝాన్సీ వెల్లడించారు.అక్కడికి వచ్చిన ఆర్టిస్టులకు చైతన్య అన్నయ్య అప్పు చేసి పేమెంట్ ఇచ్చాడని ఆమె అన్నారు.

కళాకారులకు అన్యాయం జరగకూడదని చైతన్య అన్నయ్య భావిస్తాడని పేమెంట్ సర్దడానికి అప్పు మీద అప్పు చేస్తూ ఇబ్బంది పడ్డాడని ఝాన్సీ తెలిపారు.ఢీ షో నెక్స్ట్ సీజన్ లో పాల్గొనే అవకాశం చైతన్యకు వచ్చిందని ఝాన్సీ అన్నారు.ఇంతలోనే ఈ విధంగా జరిగిందని చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

ఝాన్సీ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు