డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవతున్న లబ్ధిదారులు హైదరాబాద్ రోడ్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ కనీస మౌలిక వసతులైన మంచి నీటి సరఫరా,డ్రైనేజీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భారీన పడే ప్రమాదం ఉందని,వెంటనే అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రం తహసీల్దార్ కు అందజేశారు.

Latest Video Uploads News