''కెప్టెన్ మిల్లర్''పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధనుష్.. ఫ్యాన్స్ వెయిటింగ్!

గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ధనుష్ కోలీవుడ్ ( kollywood ) లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రోజురోజుకూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నాడు.

వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న ధనుష్ ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

ధనుష్( Dhanush ) ముందు నుండి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు.ఇక ఈయన సార్ వంటి సినిమాతో హిట్ అందుకున్న తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంచి స్వింగ్ లో ఉన్నారు.

ప్రస్తుతం ధనుష్ క్యాప్టెన్ మిల్లర్ ( Captain Miller ) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ ఎవైటెడ్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ధనుష్ హీరోగా ప్రియాంక మోహన్ ( Priyanka Mohan ) హీరోయిన్ గా డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ క్యాప్టెన్ మిల్లర్పై తమిళ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ అంచనాలు టీజర్ రిలీజ్ తర్వాత డబల్ అయ్యాయి.

Advertisement

ఇక ఇప్పుడు ట్రైలర్ కోసం ఎదురు చూస్తుండగా ధనుష్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.ఈ సినిమా పొంగల్ రేసులో ఉన్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.మరి పొంగల్ రేసులో ఉన్న సినిమాలన్నీ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసాయి.

దీంతో ధనుష్ కూడా కెప్టెన్ మిల్లర్ నుండి అదిరిపోయే సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.ఈ సినిమా మోస్ట్ ఏవైటెడ్ ట్రైలర్ ను అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టు చెబుతూ మళ్ళీ పొంగల్ రేసులోనే ఉన్నట్టు కన్ఫర్మ్ చేసాడు.

అలాగే అదిరిపోయే తన స్టిల్ కూడా రివీల్ చేసాడు.దీంతో ఫ్యాన్స్ అంత ట్రైలర్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.కాగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు