వారసుడు కి దెబ్బ కొట్టిన ఆ రెండు విషయాలు 'సార్‌' కి మాత్రం భారీ కలెక్షన్స్‌

తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్ హీరోగా రూపొంది మొన్న సంక్రాంతికి వచ్చిన వారిసు/వారసుడు సినిమా తెలుగు లో నిరాశ పర్చింది.

వారిసు సినిమా తమిళనాట వంద కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేయగా.

వారసుడు మాత్రం మినిమం వసూళ్లు రాబట్టలేక పోయింది.దాంతో తెలుగు బాక్సాఫీస్ వద్ద తమిళ సూపర్ స్టార్‌ విజయ్ బొక్క బోర్లా పడ్డాడు అంటూ కథనాలు వస్తున్నాయి.

అయితే వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు చేయక పోవడంకు రెండు కారణాలు ఉన్నాయి.అందులో ముఖ్యమైనది తీవ్రమైన పోటీ ఉన్న సంక్రాంతి సీజన్ లో వారసుడు సినిమాను విడుదల చేయడం జరిగింది.

బాలకృష్ణ మరియు చిరంజీవి వంటి స్టార్స్ సినిమాలు ఉన్న సమయంలో ఈ సినిమాను విడుదల చేయడం అనేది అవివేకం అనేది ఆ తర్వాత దిల్‌ రాజుకు క్లారిటీ వచ్చి ఉంటుంది.తాజాగా సార్ సినిమా తో ధనుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Advertisement

వాతి సినిమాను తెలుగు లో సార్ గా విడుదల చేయడం జరిగింది.

సార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరియు తమిళనాట భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సార్ సినిమా ధనుష్ కెరీర్‌ బెస్ట్‌ వసూళ్లను తెలుగు బాక్సాఫీస్‌ వద్ద రాబడుతుందని అంటున్నారు.ఇంతటి భారీ వసూళ్లకు ఆ రెండు విషయాలు బాగా పని చేశాయి.

ప్రధానంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పబ్లిసిటీ దక్కింది.ధనుష్ తెలుగు మీడియా ముందుకు వచ్చి భారీగా వసూళ్లు నమోదు అయ్యే విధంగా ప్రమోషన్‌ చేశాడు.

ఇక పోటీ లేని సమయం చూసి ధనుష్ సార్ సినిమాను విడుదల చేయడం జరిగింది.అందుకే సార్ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసింది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

ధనుష్ సార్‌ సినిమా వసూళ్ల విషయంలో తెలుగు బాక్సాఫీస్ నుండి పూర్తి వివరాలు వెళ్లడి అవ్వాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు