తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.ఈ వ్యవహారంలో ముగ్గురు కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.ఈ క్రమంలో రూ.20 లక్షలు నష్ట పరిహారం ఇచ్చే విధంగా చూడాలని కాంగ్రెస్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.







