వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.100 రోజుల్లో 300 తప్పులు అంటూ విమర్శలు చేస్తున్నారు.ఆ విమర్శలపై వైకాపా నాయకులు కూడా ధీటుగానే సమాధానం ఇస్తున్నారు.తాజాగా అనకాపల్లిలో వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు స్పందించారు.ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ఇంకా ఆ పార్టీ అధినే చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి హైకోర్టు రాకుండా చేయడంతో పాటు, తనకు తాను ఒక సూపర్ ప్రధానిగా భావించి ప్రత్యేక విమానాల్లో దేశాలను చుట్టావు.
మోడీపై ఉన్న కోపంతో రాష్ట్రమంత సభలు పెట్టి ప్రజాధనం వృదా చేశావు.ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేసేందుకు ప్రయత్నించావు.దేవాలయ భూములు మరియు ఆదాయాన్ని కూడా వదలకుండా టీడీపీ నాయకులు భోం చేశారు.కాని వైకాపా మాత్రం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపుగా 90 శాతం హామీలను నెరవేర్చడం జరిగింది.
ఇంత తక్కువ సమయంలో ఇంత పని చేయడం ఎవరికి సాధ్యం కాదు.ఇది జగన్‌కు ప్రపంచ రికార్డ్ అంటూ దాడి అన్నారు.







