గ్యాంగ్‌ లీడర్‌ : విడుదల వారం కూడా లేదు ఇప్పుడు టైటిల్‌ మార్పు

నాని హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’.ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గ్యాంగ్‌లీడర్‌ చిత్రం టైటిల్‌ విషయంలో వివాదం ముదిరింది.

 Hero Nani Wants To Change Movie Title Of Gang Leader 2019 Hero Nani Tollywood B-TeluguStop.com

టైటిల్‌ ప్రకటించిన సమయంలోనే పెద్ద గొడవ జరిగింది.దాన్ని సరి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి.

గొడవ సర్దుమనిగిందని అంతా భావించారు.కాని సినిమా విడుదలకు వారం రోజుల ముందు మళ్లీ ఆ గొడవ రాజుకుంటుంది.

వారితో మైత్రి మూవీస్‌ వారు సరిగా డీల్‌ చేయలేదని, దాంతో గ్యాంగ్‌లీడర్‌ టైటిల్‌ ఓనర్స్‌ ఛాంబర్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.

Telugu Actress Lakshmi, Gang, Nani, Telugu Ups, Tollywood Box-

  ఈ సమయంలో చేసేది లేక నాని అండ్‌ టీం గ్యాంగ్‌ లీడర్‌ టైటిల్‌ను మార్చేశారు.ఇలాంటి సందర్బాల్లో ఎక్కువగా టైటిల్‌కు ముందు హీరోల పేర్లను తలిగించడం జరుగుతూ ఉంటుంది.అలాగే ఈ చిత్రం విషయంలో కూడా అలాగే జరుగుతోంది.

కాని ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటీ అంటే నాని అనే పదాన్ని చిన్నగా వేయకుండా గ్యాంగ్‌ లీడర్‌ స్థాయిలో వేయడం జరుగుతుంది.గ్యాంగ్‌ లీడర్‌ మాత్రమే కాకుండా ఇకపై ఈ చిత్రాన్ని నానిస్‌ గ్యాంగ్‌ లీడర్‌ అని పిలవాల్సి ఉంటుంది.

Telugu Actress Lakshmi, Gang, Nani, Telugu Ups, Tollywood Box-

  ప్రమోషన్స్‌ మరియు ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా నాని గ్యాంగ్‌ లీడర్‌ అంటూ చెప్పాల్సిందే.ఒక వేళ నాని పదం లేకుండా కేవలం గ్యాంగ్‌ లీడర్‌ అంటూ మాత్రమే చెబితే మాత్రం చర్యలకు ఛాంబర్‌ పెద్దలు సిద్దం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.అందుకే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ నాని గ్యాంగ్‌ లీడర్‌ టీం ముందుకు పోతుంది.ఒక రివేంజ్‌ స్టోరీని ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ చిత్రంలో దర్శకుడు విక్రమ్‌ చూపించాడు.

ఈ చిత్రంతో నాని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube