తెలంగాణ రాష్ట్రంను స్వచ్చంగా, పరిశుభ్రంగా ఉంచాలంటూ సీఎం కేసీఆర్ ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే.పల్లె ప్రాంతాల్లో కలెక్టర్లు తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుని, అక్కడ పారిశుద్యంను గురించిన జాగ్రత్తలు తీసుకోవాంటూ సూచించిన నేపథ్యంలో తాజాగా నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకటరావు జిల్లాలోని ఊట్కూరు మండలం తిప్రాస్‌పల్లి గ్రామంలో పర్యటించాడు.
ఈ సందర్బంగా అక్కడ కలెక్టర్ స్థానికులకు పారిశుద్యంపై అవగాహణ కల్పించాడు.
గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు పక్కన కట్టెలను వేయడంతో పాటు, అక్కడ అపరిశుభ్రంగా ఉండటంతో ఆ కట్టెలు వేసిన వ్యక్తికి కలెక్టర్ ఏకంగా రూ.5 వేల జరిమాన విధించడం జరిగింది.కట్టెలను వెంటనే తొలగించాలంటూ ఆదేశించారు.
రోడ్డుకు ఇరు వైపుల ఎలాంటి ఆక్రమణలు ఉన్నా ఊరుకునేది లేదంటూ చెప్పుకొచ్చాడు.ఇక అక్కడే మట్టితో కూరుకు పోయిన ఒక కాలువ నుండి మట్టిని తీయడంతో పాటు, స్థానికులతో కూడా తమ గ్రామంను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మీదే అంటూ మోటివేషన్ చేశారు.
ప్రస్తుతం కలెక్టర్ వెంకటరావు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







