దేవర మూవీకి బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారా.. అక్కడ 100 కోట్లు పక్కా అంటూ?

కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన దేవర సినిమా( Devara Movie ) తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

చాలా రకాల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది.ఈ సినిమా పేరు కామెంట్ చేసే వారిని సైతం మూయించింది.

హిందీలో కనీస ఓపెనింగ్స్ కూడా రావడం కష్టమని భావించారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయేలా హిందీలో( Hindi ) అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది దేవర మూవీ.

Devara Hindi Collections, Devara, Ntr, Jr Ntr, Devara Collections, Devara Hindi

ఇటీవల సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల అయిన దేవర మొదటి రోజు రూ.7.95 కోట్ల నెట్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.రెండో రోజు మరింత జోరు చూపించి రూ.9.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది.ఇక మూడో రోజు ఏకంగా రూ.12.07 కోట్లతో వావ్ అనిపించుకుంది.దీంతో మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ.30 కోట్ల షేర్ ని రాబట్టింది.ఇదే జోరు కొనసాగితే ఫస్ట్ వీక్ లో 50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.ఫుల్ రన్ లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు.

Devara Hindi Collections, Devara, Ntr, Jr Ntr, Devara Collections, Devara Hindi
Advertisement
Devara Hindi Collections, Devara, Ntr, Jr Ntr, Devara Collections, Devara Hindi

ప్రస్తుతం బాలీవుడ్ లో దేవర సినిమాకు వస్తున్న రెస్పాన్స్ని బట్టి చూస్తే ఈ సినిమా తప్పకుండా 100 కోట్లు కలెక్షన్స్ సాధించడం ఖాయం అని తెలుస్తోంది.అలా నార్త్ లో పాజిటివ్ టాక్ రావడంతో నార్త్ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.దేవర సినిమా అద్భుతంగా ఉందంటూ అక్కడి ఆడియన్స్ చెబుతున్నారు.

ముఖ్యంగా మాస్ ఏరియాల్లో ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.మరి దేవర సినిమా హిందీలో ఇంకా ముందు ముందు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు