నిర్భయ దోషుల ఉరి ఆలస్యం ఎందుకు?

సుదీర్ఘ కాలం తర్వాత నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు కాబోతుంది అంటూ నిర్భయ తల్లిదండ్రులు మరియు దేశ వ్యాప్తంగా అమ్మాయిలు అనేక వర్గాల వారు ఆనందం వ్యక్తం చేశారు.

అదుగో ఇదుగో ఉరి అంటూ వార్తలు వచ్చాయి.

సుప్రీం కోర్టు మరియు రాష్ట్రపతి వారు పెట్టుకున్న క్షమాభిక్షలను కొట్టి పారేశారు.ఇక ఉరి తప్పదు అనుకుంటున్న సమయంలో ఇద్దరు ముగ్గురు లాయర్లు నిర్భయ దోషుల ఉరిని అడ్డుకుంటూ పిటీషన్స్‌ వేయడం జరిగింది.

వారు పబ్లిసిటీ కోసం.మీడియా అటెన్షన్‌ కోసం ఈ పిటీషన్స్‌ వేసినట్లుగా విమర్శలు వస్తున్నాయి.

వారు మాత్రం మానవతా దృక్పదంతో ఇలా చేస్తున్నామని, వారికి సాయం చేసే ఉద్దేశ్యం అయితే లేదు కాని వారి ఉరితో అలాంటి దారుణాలు ఆగవు కనుక వారిని చంపేయడం కరెక్ట్‌ కాదు అంటూ వాదిస్తున్నారు.వారి వాదనలతో సుప్రీం కోర్టు దోషుల ఉరిని వాయిదా వేసింది.

Advertisement

ఉరి శిక్ష పడటం అయితే ఖాయం.కాని కాస్త ఆలస్యం అంటూ న్యాయ నిపుణులు చెబుతున్నారు.

కొందరు పనికిరాని వారు పబ్లిసిటీ కోసం చేస్తున్న ప్రయత్నాల కారణంగా వారి ఉరి ఆలస్యం అవుతుందని నెటిజన్స్‌ మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు