గత ఏడాది చైనాలో ప్రాణంపోసుకున్న కరోనా వైరస్.చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రపంచదేశాలు పాకేసిన సంగతి తెలిసిందే.
ఈ మహమ్మారి ధాటికి అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.ఇక ఇది వార్షాకాలం కావడంతో కరోనాతో పాటు డెంగ్యూ వైరస్ కూడా వేగంగా విజృంభిస్తోంది.
డెంగ్యూ సోకితే.కేవలం రెండు రోజులు వ్యవధిలోనే రక్త కణాలు పడిపోయి మరణిస్తారు.డెంగ్యూకి కూడా వ్యాక్సిన్ లేదు.అయితే తాజాగా ఓ యువకుడిపై ఒకేసారి కరోనా మరియు డెంగ్యూ దాడి చేశాయి.
ఇలా ఒకేసారి రెండు భయంకర వైరస్‌లు ఎటాక్ చేయడం డాక్టర్లను విస్మయపరుస్తోంది.ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఇటీవల జ్వరం, గొంతునొప్పి, నీరసం వంటి పలు సమస్యలతో బాధపడుతూ ఓ 20 ఏళ్ల యువకుడు ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు.అతడికి ముందుకు కరోనా టెస్ట్ నిర్వహించగా.పాజిటివ్ అని నిర్థారణ అయింది.
అయితే అదే సమయంలో అతడి రక్త కణాలు దారుణంగా పడిపోయాయి.
మరియు శరీరంపై దద్దుర్లు కూడా రావడంతో.
వైద్యులు వెంటనే అతడికి డెంగ్యూ టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో డాక్టర్లు విస్తుపోయారు.ఇక కొద్దిరోజుల పాటు చికిత్సపొందిన సదరు యువకుడు చివరకు అతి కష్టంమీద కోలుకున్నాడు.
అయితే ఇలా రెండు వైరస్‌లు ఒకేసారి దాడి చేయడం చాలా ప్రమాదకరమని.అందుకే ఎంతో అప్రమత్తంగా ఉంటూ.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.