వైరల్: అతనికి కాసుల వర్షం కురిపిస్తున్న కాకులు.. ఎలా అంటే..?!

హిందూ సంప్రదాయం ప్రకారం మరణించిన వారికి పిండాలు పెడుతుంటారు.వారు చనిపోయిన మూడు రోజులకు, 11 రోజులకు చనిపోయిన వారికి నచ్చిన వంటకాలతో పిండాలు పెడతారు.

అయితే పిండాలు పెట్టిన సమయంలో కాకులు వచ్చి వాటిని తింటాయని ఎదురుచూస్తారు.కాకులు వచ్చి పిండాలను తింటే చనిపోయిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు.

అయితే ప్రస్తుత కాలంలో కాకులు కనుమరుగవుతున్నాయి.కాలుష్యం కారణంగా కాకుల జాడే లేకుండా పోయింది.

దీంతో ఎవరైనా చనిపోయినప్పుడు పిండాలు పెట్టినా కాకులు రావడం లేదు.కాకులు కనుమరుగవడంతో ఢిల్లీకి ఓ వ్యక్తి కాకులను పెంచుకుంటూ వాటితో ఆదాయం పొందవచ్చని కొత్తగా ఆలోచించాడు.

Advertisement

రెండు కాకులను పెంచుకుంటూ.పిండప్రదానాలకు, వైకుంఠ సమారాధనలకు కాకులను తీసుకుని వెళ్తున్నాడు.

కాకుల్ని తీసుకెళ్ళినందుకు డబ్బుల్ని తీసుకుంటూ ఆదాయం పొందుతున్నాడు.ఇక చాలా మంది పిండాలు పట్టుకుని అతడి ఇంటికే వస్తున్నారంటే అతడి కాకులకు ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

అంతేకాదు ఈ విషయం అందరికీ చేరాలని అతడు ఫేస్ బుక్ ను వాడుకుంటున్నాడు.పిండప్రదానాలకు, సమారాధనలకు కాకి లభించును అంటూ పోస్టులు పెట్టి దానిని వైరల్ చేస్తున్నాడు.

తెలివిని ఉపయోగించుకుని ఇలా వెరైటీ బిజినెస్ చేస్తున్నాడు.దీంతో అతడు పెంచుతున్న కాకులే అతడికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కొన్నిసార్లు ఈ కాకులను కొంతమంది అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకుంటారట.

Advertisement

కాకుల కరువు అతడి బిజినెస్ ఆలోచనకు ప్రాణం పోసింది.కొన్ని సందర్భాల్లో కాకుల అవసరం ఉన్నవారు కారులో వచ్చి ఇతడిని తీసుకెళ్తున్నారట.వారి పని పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చి ఇంటివద్ద దింపి వెళ్తారట.ఇలా కాకులను ఆధారంగా చేసుకుని అతడు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆర్జిస్తున్నాడు.ఈయన గురించి విన్నవారు తెలివి ఉంటే చాలు ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవచ్చు.

దానికి ఇతడే చక్కని ఉదాహరణ అని చెబుతున్నారు.బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి.

మనం కాస్త ఆలోచించాలి అంతే అని ఈ ఢిల్లీకి చెందిన పెద్దాయన మనకు సందేశాన్నిస్తున్నాడు.

తాజా వార్తలు