ఆస్పత్రి చెత్త ఆఫర్: బిల్లు కట్టలేకపోతే వారికే బిడ్డను అమ్మేయాలట!

ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నాయి.అందిన కాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయి.

బిల్లు కట్టలేని వారి దీన స్థితిని అర్థం చేసుకోకుండా వాళ్లకు చెత్త ఆఫర్లు ఇస్తున్నాయి.తాజాగా ఆగ్రాలోని ఒక ఆస్పత్రి యాజమాన్యం బిల్లు కట్టలేకపోతే బిడ్డను తమకే ఇచ్చేయాలని లక్ష రూపాయలు ఇస్తామని ఒక పేద కుటుంబానికి ఆఫర్ ఇచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఆగ్రాకు చెందిన బబిత, ఆమె భర్త నిరుపేద కుటుంబానికి చెందిన వారు.బబిత భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బులే ఆ కుటుంబానికి జీవనాధారం.

గర్భవతి అయిన బబిత కొన్ని రోజుల క్రితం ఆగ్రాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.ఆస్పత్రి యాజమాన్యం ఆపరేషన్, మందులు, ఇతర ఖర్చుల నిమిత్తం 35 వేల రూపాయలు చెల్లించాలని బబిత భర్తకు సూచించింది.

Advertisement

అయితే రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం కావడంతో అంత మొత్తం చెల్లించడం సాధ్యం కాదని బబిత భర్త చెప్పాడు.దీంతో ఆస్పత్రి యాజమాన్యం తాము లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు బిల్లును మాఫీ చేస్తామని.

అయితే బిడ్డను మాత్రం తమకు ఇచ్చేయాలని చెత్త ఆఫర్ ఇచ్చింది.ఏం చేయాలో పాలుపోని బిడ్డ తల్లిదండ్రులు చివరకు బిడ్డను వదులుకున్నారు.

అయితే బిడ్డను కోల్పోయిన బాధ వెంటాడంతో దంపతులు మీడియా ముందుకు వచ్చి అసలు విషయం చెప్పారు.జిల్లా మెజిస్ట్రేట్ ఈ ఘటన విషయంలో వెంటనే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అయితే ఆస్పత్రి యాజమాన్యం మాత్రం తల్లిదండ్రులు బిడ్డను దత్తత ఇచ్చారని తాము బలవంతం చేయలేదని పేర్కొంది.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు