ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో మొదటిసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు.ఈ మేరకు ఆయన రౌస్ అవెన్యూ కోర్టుకు( Rouse Avenue Court ) వెళ్లారు.
మద్యం కుంభకోణం కేసులో విచారణకు హజరు కాకపోవడంతో ఈడీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో దర్యాప్తు కోసం ఇప్పటివరకు కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఈడీ ఎనిమిది సార్లు నోటీసులు పంపింది.
కాగా తనకు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఆయన విచారణకు గైర్హాజరు అవుతూ వస్తున్నారు.ఈడీ పిటిషన్ నేపథ్యంలో మొదటిసారిగా రౌస్ అవెన్యూ కోర్టు ముందు కేజ్రీవాల్ హాజరయ్యారు.
మరోవైపు ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం వంటి పరిస్థితుల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







