Kayleigh Castle First Date : ఫస్ట్ డేట్ కోసం 8,000 కిలోమీటర్లు ప్రయాణించింది కానీ చివరికి?

సాధారణంగా డేట్ కి వెళ్లేవారు భాగస్వామిని కనుగొనాలని చాలా ఆశపడుతారు.ఎవరినైనా బాగా ఇష్టపడితే ఎన్ని కష్టాలనైనా అధిగమించి డేట్ కి అటెండ్ అవుతుంటారు.

 London Woman Travels Over 5000 Miles To San Francisco For First Date Chooses To-TeluguStop.com

తాజాగా ఒక లండన్ యువతి( London Woman ) కూడా అంతే చేసింది.ఆమె ఫస్ట్ డేట్( First Date ) కోసం ఏకంగా ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణించింది.

అయితే అన్ని కష్టాలు పడి ఆమె తన డేట్‌ను కలిసినా.చివరికి వారు లవర్స్ కాలేదు, ఫ్రెండ్స్ గానే మిగిలిపోయారు.

ఇప్పుడు ఆమె స్టోరీ చాలామందికి షాక్ ఇస్తోంది.

వివరాల్లోకి వెళితే, కైలీ కాజిల్( Kayleigh Castle ) అనే 35 ఏళ్ల లైఫ్ కోచ్‌ మెక్సికోలో వెకేషన్ సమయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కలుసుకుంది.

అతనితో సమయం గడపడానికి లండన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు( San Francisco ) వెళ్లాలని నిర్ణయించుకుంది.అందుకు ఒక డిన్నర్ డేట్ లాంటిది ప్లాన్ చేసింది.అతడితో ఫస్ట్ డేట్ కోసం ఆమె పది రోజులు కేటాయించింది.ఆమె విమానాలను బుక్ చేయగా, వారిద్దరూ కలిసి గడిపే క్షణాలను అతడు ప్లాన్ చేశాడు.

శాన్ ఫ్రాన్సిస్కోలో ఇద్దరూ కలుసుకున్నాక ఒక అందమైన తీరప్రాంత డ్రైవ్ లో పాల్గొన్నారు.

Telugu Friendship, Kayleigh Castle, London, Longdistance, Mismatched, Nri, Roman

పాపులర్ యోస్మైట్ నేషనల్ పార్క్ కూడా విజిట్ చేశారు.వాళ్లు చాలా ఆనందకరమైన క్షణాలను గడిపారు కానీ కైలీ తన డేట్‌కు తనకు సూట్ కాడని భావించింది.ఎందుకంటే అతను తరచుగా తన ఫోన్‌తోనే గడిపేస్తున్నాడు.

అతడు తనతో క్షణకాలం ఆనందించడం కంటే పనిపై దృష్టి పెట్టడమే ఆమె గమనించింది.ఆమె పార్కుల అందాలను ఆస్వాదించాలని, అర్థవంతమైన సంభాషణలు చేయాలని కోరుకున్నా, అతను బార్లలో పని, ఇతరులతో మాట్లాడడం పైనే ఎక్కువ శ్రద్ధ చూపించాడు.

దాంతో ఆల్రెడీ నేను ప్రేమికుడిగా చూడకుండా మామూలు స్నేహితుడిగా ఆమె చూసింది.

Telugu Friendship, Kayleigh Castle, London, Longdistance, Mismatched, Nri, Roman

డేటింగ్ అనేది కాలక్రమేణా ఎవరినైనా తెలుసుకునే ప్రక్రియ అని, కొన్నిసార్లు అది ప్రేమ కంటే స్నేహానికి దారితీస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.వీరు మంచి సమయం గడిపినప్పటికీ, చివరికి స్నేహితులుగా తమ సంబంధాన్ని కొనసాగించడం ఉత్తమ నిర్ణయం అని అంగీకరించారు.వారు ఇప్పటికీ టచ్‌లో ఉంటారు, వారి ప్రత్యేకమైన మొదటి తేదీ జ్ఞాపకాలను ప్రేమిస్తారు, అయితే వారి సంబంధం రొమాంటిక్ రిలేషన్‌షిప్‌గా మారదని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube