ప్రియురాలిని పెళ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్.. పెళ్లి ఫోటోలు వైరల్..!

ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ( All rounder Mitchell Marsh )తన ప్రియురాలు గ్రెటా మాక్ ను ఇటీవలే వివాహం చేసుకున్నాడు.

ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మిచెల్ మార్ష్ వివాహం చేసుకోవడం కోసం ఈ ఐపీఎల్ సీజన్ లో మధ్యలోనే స్వదేశానికి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా( Australia )లోని గ్రేస్ టౌన్ లో కొంతమంది దగ్గరి సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా మిచెల్ మార్ష్ జరిగింది.

మిచెల్ మార్ష్ పెళ్లి వేడుకలు బ్లాక్ కలర్ షూట్ ధరించగా, గ్రెటా మాక్ తెలుపు రంగు గౌను ధరించింది.బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ దుస్తులలో ఈ నూతన వధూవరులు వివాహ వేడుక జరుపుకున్నారు.

వివాహ వేడుకకు హాజరు కావడం కోసం మిచెల్ మార్ష్ రాజస్థాన్ రాయల్స్( Rajasthan Royals ) తో జరిగిన మ్యాచ్లో అందుబాటులో లేడు.ఢిల్లీ క్యాపిటల్స్ ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్లలో కూడా మిచెల్ మార్ష్ అందుబాటులో ఉండకపోవచ్చు.ప్రస్తుతం జట్టులో మార్ష్ స్థానంలో రొవ్ మన్ పావెల్ కొనసాగుతున్నాడు.

Advertisement

అయితే మిచెల్ మార్ష్ లేని లోటు ఢిల్లీ జట్టులో స్పష్టంగా కనిపించింది.రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన మ్యాచ్ లో రోవ్ మన్ పావెల్ నిరాశపరిచాడు.

ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మూడు మ్యాచ్లలో ఘోర ఓటములను చవిచూసింది.ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో జరుగనుంది.

ముంబై ఇండియన్స్ కూడా ఆడిన రెండు మ్యాచ్లలో ఘోర ఓటమిలో ఖాతాలో వేసుకుంది.ఏప్రిల్ 11న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ తో మొదటి గెలుపు ఖాతాలో వేసుకోవాలని ఇరుజట్లు ప్రయత్నిస్తున్నాయి.ఈ సీజన్లో ఈ రెండు జట్లు తప్ప అన్ని జట్లు గెలుపును నమోదు చేసుకున్నాయి.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

కాబట్టి ఏప్రిల్ 11న జరిగే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు