బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి మనందరికీ తెలిసిందే.ఏడాది ఆరంభంలోనే కొత్త ఏడాది కొత్త రోజునే షణ్ముఖ్ జస్వంత్ కు దీప్తి సునైనా బ్రేకప్ చెప్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే దీప్తి సునైనా తన లవ్ బ్రేకప్ చెప్పడానికి కారణాలు కూడా లేకపోలేదు.దీప్తి సునైనా ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో సిరి తో కలిసి హగ్గులు, కిస్సులు అంటూ రెచ్చిపోయిన విషయం తెలిసిందే.
ఇక వారి ప్రవర్తన నచ్చక దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ చెప్పింది అని తెలుస్తోంది.
ఎవరు ఊహించని విధంగా దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ చెప్పి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.
షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సునైనాను కలవకపోవడంతో అందరికీ అనుమానాలు వచ్చాయి.అంతేకాకుండా దీప్తి సునైనా తన నెంబర్ ని బ్లాక్ చేసింది అని షణ్మఖ్ చెప్పడంతో అనుమానాలు మరింత పెరిగాయి.
ఒక సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజం చేస్తూ దీప్తి సునైనా,షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేక్ అప్ చెప్పేసింది.షణ్ముఖ్ జస్వంత్ మాత్రం ఆ బ్రేక్ అప్ ను అంగీకరించినట్లు కనిపించడం లేదు.
దీప్తి సునైనా కోసం షణ్ముఖ్ ఇంకా వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

దీప్తి సునైనా బర్త్ డే సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ స్పెషల్ గా మిడ్ నైట్ విషెస్ చెప్పినప్పటికీ ఆ విషయాన్ని దీప్తి సునైనా పెద్దగా పట్టించుకోలేదు.కాగా తాజాగా దీప్తి సోషల్ మీడియాలో కొటేషన్స్ షేర్ చేసింది.కొత్త సంవత్సరం ఏంటో ఇలా ఉంది.
కొందరు ఒంటరిగా బతుకుతున్నారు.ఇంకొందరు బాధల్లో ఉన్నారు.
మరికొందరు డోలో వేసుకుంటున్నారు అంటూ దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ స్టోరీలో కొటేషన్స్ షేర్ చేసింది.ఇక ఈ కొటేషన్ ను బట్టి చూస్తే దీప్తి సునైనా తాను అనుభవిస్తున్న పరిస్థితులను చెప్పకనే చెప్పేసింది అని తెలుస్తోంది.