మరోసారి సిక్స్ ప్యాక్ చూపించనున్న 'ది వారియర్'.. గెట్ రెడీ..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకుని యాక్షన్ హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే.చాకోలెట్ బాయ్ ని పూరీ జగన్నాథ్ ఇష్మార్ట్ శంకర్ సినిమాతో పూర్తిగా మార్చేసి రఫ్ లుక్ లో మాస్ హీరోగా చూపించాడు.

 Ram Pothineni The Warrior Latest Update, Ram Pothineni, The Warrior, Interesting-TeluguStop.com

ఈ సినిమాలో రామ్ ను ఆ లుక్ లో చూసిన ఆయన ఫ్యాన్స్ ముందు షాక్ అయ్యారు.

మరి రామ్ పోతినేని ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మరిన్ని యాక్షన్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు.

రామ్ లాస్ట్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేక పోయింది.కానీ రామ్ కు మాస్ హీరోగా మంచి పేరు తెచ్చింది.ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

లింగుస్వామి తో సినిమా ప్రకటించడంతో ఒక్కసారిగా అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోను బాగా అంచనాలు పెరిగాయి.ఈ సినిమాకు ‘ది వారియర్‘ అనే టైటిల్ అనౌన్స్ చేసారు.

ఈ సినిమాలో మొదటిసారి రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Lingusamy, Ram Pothineni, Rampothineni, Warrior-Movie

ఈ సినిమాలో పోలీస్ పాత్ర కోసం రామ్ కండలు పెంచారని.మరోసారి తెరపై సిక్స్ ప్యాక్ చూపించ బోతున్నాడని ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే రామ్ ఇష్మార్ట్ శంకర్ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు మరోసారి సిక్స్ ప్యాక్ చూపించడానికి రామ్ రెడీ అయిపోయాడు.మరి పోలీస్ ఆఫీసర్ పాత్రతో రామ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.ఇక ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube