సోదరి లవర్ తో స్టార్ హీరోయిన్ శృంగారం.. ఏం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కొత్తతరహా కథాంశాలతో కూడిన కథలు ఎక్కువగా బ్లాక్ బస్టర్ హిట్ ఫలితాన్ని అందుకుంటున్నాయి.అయితే తెలుగులో కొత్తతరహా కథాంశాలను ప్రేక్షకులు ఇష్టపడినా బోల్డ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడరు.

 Deepika Padukone Unexpected Bold Role In Director Shakun Batra Film , Deepika Da-TeluguStop.com

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ కథాంశంతో తెరకెక్కిన సినిమాలు సైతం సూపర్ హిట్ ఫలితాన్ని అందుకుంటాయి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన తరువాత సినిమాలో బోల్డ్ రోల్ లో నటిస్తున్నారు.

సోదరి లవర్ తో శృంగారం చేసే పాత్రలో దీపికా పదుకొనే నటించబోతున్నారని తెలుస్తోంది.తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన దీపికా పదుకొనే అందం, అభినయంతో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

దాదాపు అందరు బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన దీపిక ప్రభాస్ కు జోడీగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

Telugu Ananya Panday, Deepika Role, Deepika, Nag Ashwin, Prabhas, Shakun Batra,

మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన దీపిక పలువురు ప్రముఖులతో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచారు.పెళ్లి తరువాత సినిమాలతో పాటు యాడ్స్ లో కూడా నటించి దీపిక సత్తా చాటుతున్నారు.షకున్ బాత్రా డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో దీపికా పదుకొనే నటిస్తుండగా ఈ సినిమాలో సోదరి అయిన అనన్య పాండే లవర్ తో దీపిక శృంగారం చేస్తుందని ఆ తరువాత కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయని సమాచారం.

స్టోరీ లైన్ లీక్ కావడంతో ఒక వర్గం ప్రేక్షకుల్లో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాతో పాటు 83, పఠాన్, ఫైటర్ సినిమాలలో దీపికా పదుకొనే నటిస్తున్నారు.

దీపిక ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ దీపికకు సంవత్సరం సంవత్సరానికి సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube