అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ఓ మిర్చి రైతు ఆత్మహత్య కి పాల్పడ్డాడు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తిరుమలాయపాలెం మండలపరిధిలోని మంగళిబండ తాండకు చెందిన దారవత్ బాలోజీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

తన ఎకరం వ్యవసాయ భూమితో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని రెండెకరాలలో మిర్చి పంట వేశాడు.లక్షల రూపాయలు అప్పు తెచ్చి మిర్చి పంట సాగు చేస్తే, పంట దిగుబడి రాకపోగా తెగులు సోకి ఎండిపోయింది.

తెచ్చిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన రైతు బాలోజీ తన పంట పొలం లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై గిరిధర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Latest Rythu News