జైపూర్ పేలుళ్ళ కేసు... నలుగురుకి మరణశిక్ష

2008 జైపూర్ లో జరిగిన వరుస పేలుళ్ళ ఘటనలో దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేశాయి.

ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సీరియల్ బాంబ్ బ్లాస్ట్స్ కి పాల్పడి 72 మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు.

ఆ ఘటన తరువాత ఇండియాలో ఉగ్రవాద ఆనవాళ్ళు ఒక్కసారిగా భయపెట్టాయి.అయితే ఆ బాంబ్ బ్లాస్ట్స్ కి పాల్పడిన వారిని గతేడాది ఫిబ్రవరిలో ఢిల్లీ స్పెషన్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిలో అరిజ్ ఖాన్ అలియాస్ జునైద్‌ కీలక సూత్రధారి అతను జైపూర్ తో పాటు ఢిల్లీ, అహ్మదాబాద్ సహా 2008లో చోటుచేసుకున్న వరుస పేలుళ్లకు కీలక సూత్రధారిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.ఇక ఈ ఘటనపై రాజస్థాన్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

ఈ కేసులో దోషులుగా తేలిన మొత్తం నలుగురు నిందితులకు మరణశిక్ష విధించింది.ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న మొత్తం ఐదుగురిలో నలుగురిని దోషులుగా ప్రకటించగా మరో వ్యక్తిపై ఆరోపణలు రుజువుకాకపోవడంతో అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.

Advertisement

కాగా దోషులుగా తేలిన నలుగురికి శిక్షలు ఖరారు చేసింది.మరణ శిక్ష పడిన నిందితుల్లో సైఫూర్ రెహ్మాన్, సర్వార్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సల్మాన్ ఉన్నారు.

ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)
Advertisement

తాజా వార్తలు