యజమానికి చెవిటి కుక్క షాక్.. ఇల్లు పీకి పందిరి వేసింది!

సాధారణంగా కుక్కల్లో చిలిపితనం ఎక్కువగానే ఉంటుంది.మరీ ముఖ్యంగా చిన్న కుక్క పిల్లలు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొరికి పాడు చేస్తుంటాయి.

అయితే వీటిపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉండాలి.లేదంటే అవి ఇంటిలోని అన్ని వస్తువులను చింపి పోగులు చేస్తాయి.

ఈ విషయం తెలియని ఒక యజమాని తన కుక్కని ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు.దానివల్ల అతనికి ఏకంగా 19 లక్షల నష్టం వాటిల్లింది.

వివరాల్లోకి వెళ్తే.మాంచెస్టర్‌లో కెల్లీ ఆన్ లీ( Kelly-Ann Lee ) అనే వ్యక్తి డాల్మేషియన్ జాతికి చెందిన రెండు శునకాలను పెంచుకుంటున్నాడు.వాటిలో ఒక చెవిటి కుక్క( Deaf dog ) ఉంది.

Advertisement

లుపిన్ అని ముద్దుగా పిలుచుకునే ఈ కుక్క ఎవరో ఒకరి సహాయం లేకపోతే ఉండలేదు.సరిగా ఆహారం కూడా తినలేదు.

దీన్ని చూసుకోవడం కాస్త భారమైనా ఆన్ లీ దాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు.కొద్ది రోజుల తర్వాత ఏదో పని పడి కొన్నాళ్లు ఎక్కడికో వెళ్లిపోయాడు.

ఆ సమయంలో లుపిన్‌కు చాలా బాధేసింది.అది జబ్బున కూడా పడింది.

చివరికి మైండ్ ఖరాబు అయింది.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)

ఆ పరిస్థితిలో అది కార్పెట్లు, కుర్చీలు, పరుపులు, బట్టలు, సోఫాల వంటి ఖరీదైన సామాన్లన్నీ చించేసింది.చెక్క గోడలను కూడా కొరికేసి బొక్కలు పెట్టింది.మూడు నెలల్లో అది 18 వేల పౌండ్ల విలువైన నష్టం కలిగించింది.అంటే ఇండియన్ కరెన్సీలో 18.37 లక్షలు.లుపిన్‌ ( Lupin )లో ఒక వైరస్ రావడం వల్ల అది అలా ప్రవర్తించిందని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు.

Advertisement

వ్యాక్సీన్ వేయని కుక్కలకు జన్మించినవి సాధారణంగా ఇలాంటి వైరస్ బారిన పడుతుంటాయని వెల్లడించారు.అయితే డాక్టర్లతోపాటు డాగ్ ట్రైనర్లు చెప్పిన ప్రకారం వారు లుపిన్‌ బాగోగులు చూసుకున్నారు.

దాంతో దాని రోగం నయమయ్యింది.యజమాని తన ఇంటిని కొత్త ఫర్నిచర్ తో రీప్లేస్ కూడా చేశాడు.

చివరికి వారి లైఫ్‌లో సంతోషం వచ్చింది.

తాజా వార్తలు