రూ.15 కోట్లు డిపాజిట్‌ చెయ్యాల్సిందే.. హీరో విశాల్ కు ఊహించని షాకిచ్చిన హైకోర్టు!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్( Vishal ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విశాల్ కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్( Tollywood ) ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

 Madras High Court Gives Shock To Kollywood Hero Vishal , Madras High Court, Koll-TeluguStop.com

టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.అలాగే కొన్ని డబ్బింగ్ కూడా అయ్యాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో విశాల్ కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది.రూ.15 కోట్లను శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ గా మూడు వారాలలో చెల్లించాలని ఆదేశించింది.ఒకవేళ అలా చేయకపోతే విశాల్ నటించిన సినిమాలను థియేటర్లో లేదంటే ఓటీటీలో విడుదల చేయకుండా నిషేధం విధించింది.

Telugu Anbuchelian, Vishal, Kollywood, Lyca, Madras-Movie

ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌( Anbuchelian ) నుంచి విశాల్‌ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ కోసం రూ.21.29 కోట్ల రుణం తీసుకున్నారు.ఈ రుణాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌( Lyca Productions ) ఫైనాన్షియర్‌ కు తిరిగి చెల్లించింది.

అయితే, తమకు రుణం చెల్లించేంత వరకు విశాల్‌ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇచ్చేలా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ లైకా ప్రొడక్షన్స్‌ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.కానీ ఆ ఒప్పందాన్ని హీరో విశాల్ ఉల్లంఘించారు.

ఇటీవలే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి విశాల్ హీరోగా నటించిన వీరమే వాగై సూడుం సినిమాని విడుదల చేశారు.

Telugu Anbuchelian, Vishal, Kollywood, Lyca, Madras-Movie

దాంతో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి స్పెషల్‌ కోర్టు హైకోర్టు రిజిస్ట్రార్‌ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.ఈ కేసు విచారణ సమయంలో విశాల్‌ నేరుగా కోర్టుకు హాజరై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం వల్లే రుణం చెల్లించలేకపోయాయని, పైగా తనకు ఒకే రోజున రూ.18 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కోర్టుకు తెలిపారు.దాంతో కోర్ట్ విశాల్‌ ఆస్తుల వివరాలను ప్రమాణ పత్రంలో సమర్పించాలని తెలిపింది.కాగా హీరో విశాల్ ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌ చేయగా, దీని పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజా, జస్టిస్‌ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపి గతంలో రూ.15 కోట్లను విశాల్‌ చెల్లించాలంటూ సింగిల్‌ స్పెషల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.పైగా ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పై నిర్మించే చిత్రాలు థియేటర్‌ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశించింది.ఈ విషయం కాస్త ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube