బాలీవుడ్ సాంగ్ కి కూతురుతో కలిసి స్టెప్పులు వేసిన వార్నర్

కరోనా వైరస్ కారణంగా రోజువారి పనుల నుంచి సినిమా షూటింగ్ లు, క్రికెట్ మ్యాచ్ లు అన్ని బంద్ అయిపోయాయి.

దీంతో సినీ, క్రికెట్ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితం అయ్యి ఫ్యామిలీతో ఈ ఫ్రీ టైంని స్పెండ్ చేస్తున్నారు.

కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వారి అనుభవాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.త్వరలో జరగబోయే ఐపీఎల్, ప్రస్తుతం ముక్కోణపు క్రికెట్ మ్యాచ్ లు, సిరీస్ లు అన్ని రద్దు అయ్యాయి.

దీంతో క్రికెటర్లు ఫుల్ గా కాలక్షేపం చేస్తున్నారు.టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మతో కాలక్షేపం చేస్తున్నాడు.

వారి వీడియోలని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.ఇక విదేశీ క్రికెటర్లకి ఇండియా అన్న ఇక్కడి సినిమాలు, సాంగ్స్ అన్న చాలా ఇష్టపడతాడు.

Advertisement

,/br>ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్ళుకి ఇండియా కల్చర్, సినిమాలు భాగా ఇష్టం.తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కూతుళ్లతో కలిసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సూపర్ హిట్ సాంగ్ ‘షీలా కీ జవానీ’కి స్టెప్పులు వేశారు.

ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు.తన కుమార్తె ఇవీతో కలిసి చేసిన వీడియోకి ఎవరైనా మాకు సహాయం చేయండి అని క్యాప్షన్ ఇచ్చిన వార్నర్ మరో కుమార్తె ఇండీతో చేసిన వీడియోకి ఇండీ మీ కోసం ఇంకోసారి చేద్దామని అడిగింది అని క్యాప్షన్ ఇచ్చాడు.

ప్రస్తుతం వార్నర్ పోస్ట్ చేసిన ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.మొత్తానికి వార్నర్ తన కూతుళ్ళతో బాలీవుడ్ పాటలకి స్టెప్పులు వేయిస్తూ ఇలా ఇండియా మీద తన అభిమానం చాటుకుంటున్నాడు అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి
Advertisement

తాజా వార్తలు