రోజూ జిమ్‌కి వెళ్తున్న కూతురు.. చిన్న బస్తా ఎత్తకపోవడంతో తల్లి ఏకిపారేసింది..!

సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడు బలం కోసం చాలామంది జిమ్( Gym ) కి వెళ్లి బాగా వర్క్ చేస్తుంటారు.

ఇంట్లో పనులు చేయడానికి మాత్రం బద్దకంగా ప్రవర్తిస్తారు.

జిమ్ లో ఏ పని అయితే చేస్తున్నామో అదే పని ఇంట్లో చేస్తే పెద్దవారికి కాస్త చేదోడువాదోడుగా ఉన్నట్లు ఉంటుంది.అలాగే శారీరక శ్రమ చేసినట్లు ఉంటుంది కానీ యువత అలా ఆలోచించదు.

వర్కౌట్లు చేయడమే తమ పనిగా భావిస్తారు.ఇంట్లో పనులను అసలు ముట్టుకోరు.

అయితే తాజాగా ఒక తల్లి ఇలాంటి ఒక అమ్మాయిని బాగా ట్రోల్ చేసింది.

Advertisement

గోధుమల బస్తాను( wheat sack ) ఎత్తడం లేదని ఆ తల్లి తన కూతురిని ఆటపట్టిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఖుష్బూ అనే వినియోగదారు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.వీడియో ఓపెన్ చేయగానే మనకు డోర్ బయట 20 కిలోల బరువైన గోధుమల బస్తాను లోపలకు ఎత్తుకు రమ్మని తల్లి( mother ) తన కూతురిని అడుగుతున్నట్లు కనిపిస్తుంది.

"నువ్వు జిమ్‌లో ఎలా వర్కవుట్లు చేస్తావో చూద్దాం.వెళ్లి ఆ బస్తా ఎత్తుకురా" అని తల్లి కూతురికి చెబుతోంది.

కుమార్తె బ్యాగ్‌ని ఎత్తడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది.తన గోళ్లు పొడవుగా ఉన్నాయని, విరిగిపోవచ్చని కుమార్తె కంప్లైంట్ చేసింది.తల్లి ఆమెను ఎగతాళి చేస్తూ, "ఇలాంటి సాకులు జిమ్ లో మాత్రం పని చేయవు, అవి ఇంటికి మాత్రమే, నా గోళ్లు పొడవుగా ఉన్నాయి, నా షార్ట్ చాలా పొట్టిగా ఉంది అని అన్నిటికీ సాకులు నువ్వు.

" అని అనేసింది దాంతో ఆ యువతి బుగ్గలు ఎర్రబడి ఎంబార్సింగ్‌గా ఫీల్ అయింది.ఈ వీడియోకు 1.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.తల్లి చమత్కారమైన కామెంట్స్ చాలామందికి నచ్చడంతో ఈ వీడియో ఇంకా వైరల్ చేస్తున్నారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..

చాలా మంది ఆ తల్లి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి పడిపోయారు.వ్యంగ్యంగా కూతురికి అంటించిన ఆ తల్లిని మరికొందరు కొనియాడారు.

Advertisement

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు