ఇండియన్ అబ్బాయిలతో డేటింగ్ మాములుగా ఉండదు.. ఆస్ట్రేలియన్ మహిళ కామెంట్స్..

ఆస్ట్రేలియాకు చెందిన బ్రీ స్టీల్ అనే మహిళ ఇండియా గురించి చాలా వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయింది.

ఈ ఆస్ట్రేలియన్ యువతి రీసెంట్ టైమ్స్ లో భారతదేశ అబ్బాయిలతో(Indian boys) డేటింగ్ చేసిందట.

వారితో తాను పొందిన డేటింగ్ అనుభవాల గురించి తాజాగా ఒక ఇన్‌స్టా వీడియోలో చెప్పింది.ఆమె మాటలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి.

పాడ్‌కాస్ట్ నిర్మాతగా పనిచేసే బ్రీ 2023 నుంచి భారతదేశంలో తిరుగుతూ ఉంది.ఆస్ట్రేలియాలోని పురుషులతో(Australia men)పోలిస్తే భారతీయ పురుషులు డేటింగ్ విషయంలో ఎంతగా భిన్నంగా ఉంటారో ఆమె చెప్పింది.రీసెంట్ వీడియోలో బ్రీ మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలో పురుషులు ఫ్లర్ట్ చేయమంటే జోక్‌లు చెప్తారు, కొంచెం వెటకారంగా మాట్లాడతారు.

కానీ భారతదేశంలో అందరూ చాలా మర్యాదగా ఉంటారు.ఇక్కడ సంబంధాలు చాలా త్వరగా ముందుకు సాగుతాయి.

Advertisement

ఒక పార్టీలో ఒక అబ్బాయి నా చేయి పట్టుకున్నాడు.ఇలాంటిది ఆస్ట్రేలియాలో ఎప్పుడూ జరగదు!" అని ఆశ్చర్యంగా తెలియజేసింది.

భారతదేశంలో బాలీవుడ్ సినిమాల(bollywood movie) ప్రభావం డేటింగ్‌పై బాగా పడిందని ఆమె అభిప్రాయపడింది."ఇక్కడి వాళ్లు సినిమాల్లో చూసినట్లుగానే ప్రవర్తిస్తున్నారు" అని చెప్పింది."భారతదేశంలో ఈ తరం వాళ్లు మొదటిసారిగా కేజువల్‌గా డేటింగ్ చేస్తున్నారు.

పాశ్చాత్య దేశాల్లో డేటింగ్ చాలా కాలంగా సంస్కృతిలో భాగమైపోయింది కానీ ఇక్కడ అలా కాదు.పాశ్చాత్య దేశాల్లో డేటింగ్ స్టోరీస్ తరతరాలుగా ప్రచారంలో ఉన్నాయి, స్కూల్‌ల్లో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది.

కానీ భారతదేశంలో అలాంటిది లేదు కాబట్టి, ప్రజలు సినిమాల నుంచి డేటింగ్ గురించి తెలుసుకుంటారు." అని ఆమె వెల్లడించింది.

పాన్ ఇండియా లో ప్రభాస్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే..?
ఈమెకి డ్రాకులా లాగా ఆ డిసీజ్ ఉందంట.. వెల్లుల్లి తింటే..?

ఇలాంటి డిఫరెంట్ డేటింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నది.ఆమె మాటలు విన్న చాలా మంది భారతీయులు మంచిగా ఫీలవుతున్నారు.

Advertisement

ఇకపోతే చాలామంది ఫారెన్ గర్ల్స్ ఇండియన్ బాయ్స్ ని పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు.

తాజా వార్తలు