కొరటాల-చిరు సినిమాకు డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత ఎవరితో సినిమా చేస్తారా అనే ప్రశ్నకు కొరటాల శివ రూపంలో సమాధానం దొరికింది.

అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చి రోజులు గడుస్తున్నా సినిమా మాత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు.

దీంతో మెగా ఫ్యా్న్స్‌ ఆందోళనకు గురయ్యారు.కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.

కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ఈనెల 26 నుంచి ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఓ సరికొత్త లుక్‌లో కనిపస్తారట.

ఇక ఈ సినిమాలో కూడా కొరటాల శివ స్టైల్‌లో సోషల్ మెసేజ్‌ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే ప్రశ్నకు త్రిష రూపంలో జవాబు దొరికింది.

Advertisement

గతంలోనూ చిరు-త్రిష కాంబినేషన్‌ స్టాలిన్ చిత్రంలో మెప్పించారు.మరి ఈ సినిమాలో చిరు ఎలాంటి పాత్రలో నటిస్తాడు, ఈ సినిమాకు టైటిల్ ఏమిటి అనే విషయాలపై చిత్ర యూనిట్ ప్రకటన చేయాల్సి ఉంది.

ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్స్‌పైకి వెళ్తుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు