విశ్వక్‌ సేన్ కి పెద్ద కష్టం వచ్చి పడింది కదా... పోటీ తట్టుకోవడం సాధ్యమేనా?

యంగ్‌ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) నటించిన దాస్ కా దమ్కీ( Das Ka Damki ) సినిమా గత ఫిబ్రవరిలోనే విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మార్చి 22కి వాయిదా వేయడం జరిగింది.మొన్నటి వరకు ఆ తేదీన పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం తో తప్పకుండా మంచి ఓపెనింగ్‌ వసూళ్లు నమోదు అవ్వడంతో పాటు భారీ ఎత్తున కలెక్షన్స్ ను దక్కించుకునే అవకాశం ఉందని విశ్వక్‌ సేన్ ఆశ పడ్డాడు.

 Das Ka Damki And Rangamartanda Movies Coming For Same Day , Das Ka Damki , Ranga-TeluguStop.com

స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విశ్వక్ సేన్‌ తన యొక్క ఆస్తులను అమ్మి మరీ ఈ సినిమాను నిర్మించాను అంటూ ఆ మధ్య ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పుకొచ్చాడు.అలాంటి విశ్వక్‌ సేన్ సినిమా దమ్కీ కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

కానీ అదే రోజున మా సినిమా రాబోతుంది అంటూ కృష్ణ వంశీ( Krishna Vamsi ) తన రంగమార్తాండ సినిమాను అధికారికంగా ప్రకటించాడు.ఈ మధ్య కాలంలో రంగమార్తాండ( Krishna Vamsi) సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా గురించిన చర్చ జరుగుతోంది.అంతే కాకుండా ఈ సినిమా యొక్క పాటలు మరియు ఇతర ప్రమోషన్స్ ను చిరంజీవి వంటి పెద్ద స్టార్స్ తో రిలీజ్ చేయించడం వంటివి చేయడం వల్ల మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది.అందుకే ఈ సినిమా కు పోటీగా దమ్కీ విడుదల అయితే పరిస్థితి ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో దమ్కీ సినిమాకు పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయ్యింది.

అయినా కూడా పెద్ద సినిమా గా పేరు దక్కించుకున్న రంగమార్తాండ సినిమా కు పోటీగా దమ్కీ నిలిచే అవకాశం ఉందా.పోటీని తట్టుకుని నిలదొక్కుకుంటుందా అనేది చూడాలి.

విశ్వక్ సేన్ గత చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది.కనుక ఈ సినిమా పై ఆయనకు కాస్త ఎక్కువ నమ్మకం ఉంది.

మరి ఆ నమ్మకం నిలిచేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube