జానీ మాస్టర్ అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టాడు.. సతీష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

గత కొంతకాలంగా ఒక వివాదంలో జానీ మాస్టర్( Jani Master ) పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

డాన్సర్ సతీష్( Dancer Sathish ) గతంలో జానీ మాస్టర్ గురించి సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణల గురించి జానీ మాస్టర్ వివరణ ఇవ్వడం జరిగింది.

ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ భావించగా ఎవరూ ఊహించని విధంగా ఈ వివాదానికి సంబంధించి ఎన్నో మలుపులు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం.ఈరోజు జానీ మాస్టర్ కు డబ్బు, పరపతి ఉన్నాయని అన్నం పెట్టిన వ్యక్తికే జానీ మాస్టర్ సున్నం రాశారని సతీష్ చెప్పుకొచ్చారు.

జానీ మాస్టర్ నా దగ్గర ఒకప్పుడు సాయంగా డబ్బులు తీసుకున్నాడని జానీ మాస్టర్ నాన్న చనిపోతే నేను 30, 000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నానని సతీష్ అన్నారు.జానీ మాస్టర్ కు సహాయం చేసినా అతనికి ఆ విశ్వాసం లేదని సతీష్ పేర్కొన్నారు.

జానీ మాస్టర్ కు బైక్ లేకపోతే బైక్ ఇచ్చానని జానీ మాస్టర్ ఒక సాంగ్( Song ) చేస్తే ఆరు నెలల వరకు సాంగ్ ఉండదని మిగతా డాన్స్ మాస్టర్లు( Dance Masters ) నెలకు 2 నుంచి 3 సాంగ్స్ చేస్తున్నారని సతీష్ చెప్పుకొచ్చారు.సతీష్ చేసిన కామెంట్ల గురించి జానీ మాస్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.జానీ మాస్టర్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.

Advertisement

జానీ మాస్టర్ కు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.జానీ మాస్టర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.జానీ మాస్టర్ వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని ఇలాంటి వివాదాల వల్ల ఆయన కెరీర్ కే నష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జానీ మాస్టర్, సతీష్ సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని చెప్పవచ్చు.ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు