కొడుకు రాజమౌళికి భారీ షాకిస్తున్న విజయేంద్ర ప్రసాద్.. 450 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కించనున్నారా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కించి స్టార్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రాజమౌళి.

 Vijayendra Prasad Plans A 450 Crore Budget Film On The Rss, Vijayendra Prasad, D-TeluguStop.com

కాగా జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ( Vijayendra Prasad )గురించి కూడా మనందరికీ తెలిసిందే.ఈయన ప్రముఖ రచయిత అన్న విషయం కూడా తెలిసిందే.

ఆయన రచయితగానే చాలామందికి తెలుసు.

Telugu Direct Fim, Rajamouli, Rajanna, Tollywood-Movie

కానీ దర్శకుడిగా కొన్ని సినిమాలు చేశారని చాలా తక్కువమందికి తెలుసు.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో శ్రీ కృష్ణ 2006, రాజన్న, శ్రీవళ్ళి లాంటి సినిమాలను తెరకెక్కించారు.ఇప్పుడు ఆయన మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నారని తెలుస్తోంది.అంతేకాదు, ఆ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.450 కోట్లు అని ప్రచారం జరుగుతోంది.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై సినిమా చేయడానికి విజయేంద్ర ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారట.2025 సెప్టెంబర్ నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంస్థ గొప్పతనం గురించి ఈ తరానికి తెలిసేలా ఒక భారీ చిత్రాన్ని చేయాలని భావిస్తున్నారట.

Telugu Direct Fim, Rajamouli, Rajanna, Tollywood-Movie

కాగా విజయేంద్ర ప్రసాద్ కి బీజేపీ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా ఎంతో అభిమానం.బీజేపీ( BJP ) ప్రభుత్వం 2022 జులైలో ఆయనను రాజ్యసభకు కూడా నామినేట్ చేసింది.ఈ క్రమంలో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఆర్ఎస్ఎస్ పై సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారన్న వార్త సంచలనంగా మారింది.పైగా ఈ సినిమా బడ్జెట్ రూ.400 నుంచి 500 కోట్లు అనే వార్త మరింత సంచలనం అవుతోంది.ఈ చిత్రం కోసం తెలుగు, హిందీ సహా వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపనున్నారని సమాచారం.జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ రూ.450 కోట్ల బడ్జెట్ తో, అందునా ఆర్ఎస్ఎస్ పై సినిమా చేయనున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube