ప్రత్యేక హోదా : నితీష్ కుమార్ నిప్పు రాజేశారుగా ? బాబు ఏం చేస్తారో ? 

బీహార్(Bihar ) కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జనతా యునైటెడ్ పార్టీ అధినేత నితీష్ కుమార్ కేంద్రానికి డిమాండ్ వినిపించేందుకు సిద్ధం అయ్యారు.నిన్న జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో జేడియూ ఈ నిర్ణయం తీసుకుంది.

 Nitish Kumar Special Status Demand For Bihar, Tdp, Telugudesham, Chandrababu, Cb-TeluguStop.com

బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.  ఈ మేరకు పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు.

దీనిలో బీహార్ కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ ను ప్రధానంగా తెరపైకి తీసుకువస్తూ తీర్మానాన్ని ఆ పార్టీ ఆమోదించింది.  మూడోసారి కేంద్రంలో మోది ప్రభుత్వం ఏర్పడడంతో నితీష్ కుమార్ తో పాటు , టిడిపి అధినేత చంద్రబాబు కీలకంగా మారారు.

ఈ ఇద్దరు కారణంగానే ఎన్డీఏ కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది.  దీంతో ఇప్పుడు దాన్ని అవకాశం గా తీసుకుని నితీష్ కుమార్(Nitish Kumar ) బీహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు.

దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం టిడిపి అధినేత చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారబోతుంది.

Telugu Ap, Chandrababu, Jagan, Modhi, Narendra Mod, Telugudesham-Politics

 ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పటిది కాదు.ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ను వినిపిస్తున్నా,  కేంద్రం మాత్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించలేదు .ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ కూడా కీలక కావడంతో,  బీహార్ కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలంటూ జేడీ యూ డిమాండ్ చేస్తోంది .2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu ) బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన పోరాటం చేశారు.  అయితే ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారు.

  ప్రత్యేక హోదా అనేది సంజీవనియా అంటూ అప్పట్లో చంద్రబాబు ప్రశ్నించారు.బిజెపితో పొత్తు రద్దయిన తర్వాత ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ టిడిపి తెరపై తెచ్చింది .

Telugu Ap, Chandrababu, Jagan, Modhi, Narendra Mod, Telugudesham-Politics

 ఇక 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్( YS JAGAN ) సైతం ఏపీకి ప్రత్యేక హోదా పై పెద్ద ఎత్తున పోరాటం చేశారు.2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పై ఒత్తిడి తేవడంలో ఆ పార్టీ విఫలం అయింది.ఇప్పుడు నితీష్ కుమార్ బీహార్ కు ప్రత్యేక హోదా కోరుతుండడంతో,  చంద్రబాబు సైతం ఈ డిమాండ్ ను వినిపిస్తారా అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.  ఎన్డీఏ అధికారంలో ఉండాలంటే ఏపీలోని టిడిపి,  బీహార్ లోని జేడీయు సహకారం తప్పనిసరి .దీనిని దృష్టిలో పెట్టుకుని బీహార్ కు ప్రత్యేక హోదాపై నితీష్ కుమార్ డిమాండ్ వినిపిస్తున్నారు.దీంతో చంద్రబాబు సైతం ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి డిమాండ్ వినిపించడం తప్పనిసరి కాబోతోంది.

  ఏపీకి ప్రత్యేక హోదా పై చంద్రబాబు డిమాండ్ వినిపించకపోతే విపక్షాల నుంచి జనాలు నుంచీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube