దళిత రచయిత మీద దాడి

దేశంలో పెరుగుతున్న అసహనంపై, దాడులపై రచయితలు, కవులు ఓ పక్క నిరసనలు వ్యక్తం చేస్తుండగానే మరో పక్క దాడులు జరుగుతూనే ఉన్నాయి హిందువులకు వ్యతిరేకంగా రాతలు రాశారని ఆరోపిస్తూ కర్ణాటకలో ఒక దళిత రచయిత మీద కొందరు దాడి చేశారు.

దావనగేరేలో 23 ఏళ్ళ హుచంగి ప్రసాద్ అనే రచయిత (ఇతను ఇంకా చదువుకుంటున్న విద్యార్థి ) మీద కొందరు దాడి చేశారు.

హిందూ మతానికి వ్యతిరేకంగా రచనలు చేస్తే చేతి వేళ్ళు నరికి వేస్తామని హెచ్చరించారు.ప్రస్తుతం ఈ రచయిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇతను కుల వ్యవస్థకు సంబంధించి పుస్తకం రాశాడు.హాస్టల్లో ఉంటున్న ఇతన్ని ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ తీవ్రంగా దాడి చేశారు.

ఇతని మొహం మీద కుంకుమ పూసి, చేతి వేళ్ళు నరుకుతామని బెదిరించారు.మరో కన్నడ రచయిత కె ఎస్ భగవాన్ను కూడా కొందరు బెదిరించారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు