సినిమా ఇండస్ట్రీలో లాభాలు, నష్టాలు సర్వసాధారణం.నష్టాలని కూడా స్వీకరించే వారు చాలా తక్కువే అని చెప్పాలి.
ఆ కొద్దిమందిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు.తన తాహతుకి మించి ఒవర్సీస్ లో భారి విడుదల చేసి, తీవ్రంగా నష్టపోయిన పంపిణిదారులకు రామ్ చరణ్ అభయహస్తం ఇచ్చారు.
బ్రూస్ లీ ఫ్లాప్ మూలాన బయ్యర్స్ చాలావరకు నష్టపోతున్నారు.ముఖ్యంగా 6 కోట్లకు పైగా చెల్లించి, భారి ఎత్తున రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్న ఒవర్సీస్ పంపిణిదారుల పరిస్థితి మరీ దారుణం.
నిన్న రామ్ చరణ్ తో ఒవర్సీస్ పంపిణీదారులు సమావేశమయ్యారు.చాలాసేపు వారితో చర్చించిన చరణ్, వారి నష్టాలను భరిస్తానని మాటిచ్చారు.







