15 రోజులలో దళిత బంధు గ్రౌండింగ్ చేపట్టాలి

యాదాద్రి జిల్లా:దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ వచ్చేబ్15 రోజులలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అసెంబ్లీ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లను,మండల స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు.

శుక్రవారం నాడు కాన్ఫరెన్స్ హాలులో మండల వారీగా దళిత బంధు పథకాన్ని ఆమె సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.హెచ్.కృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్,జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మాన్యా నాయక్,జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్,జిల్లా కో ఆపరేటివ్ అధికారి పరిమిళాదేవి,జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ,జిల్లా విద్యాశాఖ అధికారి నర్సింహా,జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ కృష్ణ,జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారాం,అడిషనల్ డిఆర్డిఎ నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు ముద్రించిన కరపత్రాల ఆవిష్కరణ

Latest Yadadri Bhuvanagiri News