తమిళనాడులో దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీ..!!

తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఇళయ దళపతి విజయ్ జోసెఫ్( Joseph vijay ) రాజకీయ పార్టీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు మరో నెల రోజుల్లో ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తారని సమాచారం.

రానున్న లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ పార్టీని పెట్టబోతున్నారని సమాచారం.ఇప్పటికే ఈ వ్యవహారంపై చెన్నైలోని అభిమానులతో దళపతి చర్చించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సుమారు 150 మంది జిల్లా స్థాయి ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.హీరోగానే కాకుండా దళపతి పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారన్న సంగతి తెలిసిందే.

కాగా ఆయన ప్రస్తుతం ‘గోట్ ’ చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మరో నెలరోజుల్లో పూర్తికానుండగా కొత్త పార్టీ ఏర్పాటుపై ఫోకస్ పెట్టనున్నారని సమాచారం.అలాగే విజయ్ మక్కల ఇయక్కం( Vijay Makkala Iyakkam ) పేరిట ముందుగా రిజిస్ట్రేషన్ అయిందని తెలుస్తోంది.

Advertisement

తమిళనాట సినీ, రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉన్న నేపథ్యంలో విజయ్ కొత్త పార్టీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు